New Year 2024: నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబరు 31వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు వేడుకలకు అనుమతి ఇచ్చింది. పబ్లు, క్లబ్లు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లను ఒంటి గంట వరకు తెరిచేందుకు అనుమతి లభించింది. కాకపోతే కండీషన్ పెట్టింది.. ముందస్తు అనుమతి తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
ఈ క్రమంలోనే జనవరి 1న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జనవరి 1న జనరల్ హాలిడేగా ప్రకటించింది. దానికి ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవు రద్దు చేయబడుతుంది. ఇదిలా ఉండగా న్యూ ఇయర్ వేడుకల కోసం పార్టీలకు వెళ్లేవారు, పబ్బులు, క్లబ్బులు, ఇతర పార్టీల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. పార్టీల్లో డ్రగ్స్ వాడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.