»Accident Insurance Scheme For Singareni Workers Started In Telangana
CM Revanth Reddy : సింగరేణి కార్మికులకు రూ.కోటి బీమా పథకం
ఆదాయ సమీకరణ, ఆదాయ వనరులపై నేడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనుల శాఖలపై ఆయా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు.
CM Revanth Reddy : ఆదాయ సమీకరణ, ఆదాయ వనరులపై నేడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనుల శాఖలపై ఆయా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఆయా శాఖల ఆదాయం, పన్నుల వసూళ్ల గురించి సీఎం రేవంత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖలో అక్రమాలు అరికట్టి, పన్నుల వసూళ్లు పెరిగేలా చూడాలని రేవంత్ రెడ్డి సూచించారు. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమీక్ష అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన సింగరేణి కార్మికులకు కోటి రూపాయల బీమా పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి ప్రారంభించారు.
ఈ మేరకు బ్యాంకర్లతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. హైదరాబాద్ సచివాలయంతో బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సింగరేణి కార్మికులను నిర్లక్ష్యం చేసిందన్నారు. సింగరేణి కార్మిక లోకానికి ఇది చారిత్రాత్మక రోజు అని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర క్రియాశీలకమన్నారు. గత పాలకులు సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామని రేవంత్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు ఏడాదికి రూ.70 వేల కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 2014లో మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని పదేళ్లలో సీఎం కేసీఆర్ దివాళా తీయించారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.