Nithin Kamath : తండ్రి మరణం షాక్‌తో సతమతమవుతున్న ఫిన్‌టెక్ కంపెనీ జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్‌కు ఆరు వారాల క్రితం ‘మైల్డ్ స్ట్రోక్’ వచ్చింది. దాని వివరాలను ట్విట్టర్లో పంచుకున్నారు. ఇటీవలి కాలంలో తాను నిద్రలేమి, అలసట, డీహైడ్రేషన్, పనిభారంతో ఇబ్బంది పడ్డానని, దాని కారణంగానే తాను ఈ స్ట్రోక్‌కి గురయ్యానని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభించింది.
ఇది మాత్రమే కాకుండా.. ‘నా ఆరోగ్యం క్షీణించన తరువాత ముఖం పూర్తిగా పాలిపోయింది. ఏదైనా చదవడం, రాయడం కూడా కష్టమైపోయింది. అయితే ప్రస్తుతం కాస్త కోలుకుంటున్నాను. ఏదో కొంచెం చదవగలుగుతున్నాను, రాయగలుగుతున్నాను. కానీ పూర్తిగా కోలుకోవడానికి 3 నుంచి 6 నెలలు పట్టవచ్చు’ అని నితిన్ కామత్ అన్నారు. ‘సాధారణంగా నేను ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటాను. ఫిట్‌గానూ ఉంటాను. కానీ నాకు కూడా ఇలా బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం నేను కాస్త జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు. అందుకే నేను మునుపటిలా వేగంగా ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడం లేదు.’ అని నితిన్ కామత్ పేర్కొన్నారు.
నితిన్ కామత్ తన సోదరుడైన నిఖిల్ కామత్‌తో కలిసి జెరోధా అనే డిస్కౌంట్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్‌ను నెలకొల్పారు. దేశంలో నూతన ఆవిష్కరణలను, స్టార్టప్‌లను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2020 జనవరిలో నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ (NASC)ని ఏర్పాటుచేసింది. 2023 డిసెంబర్లో ఈ ఎన్ఏఎస్సీలో నితిన్ కామత్ నాన్-అఫీషియల్ సభ్యునిగా నామినేట్ అయ్యారు.