• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం

PDPL: సుల్తానాబాద్ మండలంలో 2వ బ్యాచ్‌గా 13 గ్రామాల ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు కనుకుల రైతు వేదికలో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీడీ దివ్య దర్శనరావు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ పాలనలో సభ్యుల పాత్ర కీలకమని, గ్రామసభల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలు చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి చేరేలా అవినీతి లేకుండా పనిచేయాలని అన్నారు.

February 23, 2026 / 03:01 PM IST

మిడ్ మానేరు నిర్వాసితుల నిరసన

SRCL: మిడ్ మానేరు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చారు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని, ఇంకా పలువురికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పరిహారం చెల్లించాల్సి ఉందని నాయకులు కదిరే రాజ్ కుమార్ పాల్గొన్నారు.

February 23, 2026 / 03:00 PM IST

రోడ్డు మలుపు.. రోజుకో ప్రమాదం

BDK: కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఒక ప్రమాదకర మలుపు వరుస రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా షీ టీమ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా హైవేపై ఏర్పాటు చేసిన ఈ మలుపు వాహనదారులకు ముప్పుగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ముందస్తు హెచ్చరిక బోర్డులు, లేని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఇవాళ వాపోయారు.

February 23, 2026 / 02:59 PM IST

టీఆర్పి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఐలయ్య నియామకం

MHBD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా ఊడుగుల ఐలయ్య యాదవ్ నియమితులయ్యారు. తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ రాష్ట్ర కార్యాలయంలో వారికి సోమవారం నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని ఐలయ్య అన్నారు. నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

February 23, 2026 / 02:56 PM IST

గద్వాల కలెక్టర్ ప్రజావాణికి 82 పిర్యాదులు..

GDWL: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ ఉంచకూడదని కలెక్టర్ సూచించారు.

February 23, 2026 / 02:50 PM IST

పోలీసు ప్రజావాణికి సోమవారం 19 ఫిర్యాదులు

MBNR: జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో అధికారలు నిర్లక్ష్యం వహించకూడదని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. పోలీసు ప్రజావాణి సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. నేడు పోలీసు ప్రజావాణికి 19 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ వెల్లడించారు.

February 23, 2026 / 02:48 PM IST

గోరికొత్తపల్లిలో కనీస వసతుల లోపం

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలం ఏర్పడి సంవత్సరకాలం దాటినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ATM, బస్ సెంటర్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు కాలేదు. వెంటనే స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని MLA దృష్టికి తీసుకెళ్లి కనీస వసతులు కల్పించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

February 23, 2026 / 02:45 PM IST

ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వివిధ గ్రామాల నుంచి పలు సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. అన్ని సమస్యలను ఆయా శాఖల అధికారులకు వివరించి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో పుల్లారావు పేర్కొన్నారు.

February 23, 2026 / 02:43 PM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పరామర్శించిన ఎమ్మెల్యే

WNP: వనపర్తి మార్కెట్ యార్డులో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పెబ్బేరు మండలం జనంపల్లి గ్రామానికి చెందిన పరశురాం రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. సోమవారం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరమైన ఆర్థిక సహాయ సహకారాలు అందేలా చూస్తారని వారికి ధైర్యం చెప్పారు.

February 23, 2026 / 02:41 PM IST

పులి కలకలం.. ప్రజలకు ఎమ్మెల్యే హెచ్చరిక

JGL: భీమవరం మండలంలోని మోత్కురావుపేట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం అటవీ అధికారులతో సమీక్షించారు. మోత్కురావుపేట-చందుర్తి అటవీ మార్గంలో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. పులి కదలికలు ఉన్నందున రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావొద్దన్నారు. పులిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

February 23, 2026 / 02:39 PM IST

వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన గని

MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గని 2025-26 వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 40 రోజుల ముందుగానే అధిగమించింది. ఈ సందర్భంగా సోమవారం కార్మికులు, సుపర్ వైజర్లను జీఎం శ్రీనివాస్ అభినందించి స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. ఇదే ఒరవడితో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ బాజీసైదా పాల్గొన్నారు.

February 23, 2026 / 02:36 PM IST

ఛలో సెక్రటేరియట్‌కు ఆర్టీసీ పిలుపు

HYD: తమ హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 24న ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదరు వెంకన్న తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా గాందేయ మార్గంలో ఈ పోరాటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

February 23, 2026 / 02:34 PM IST

కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన డ్రైవర్లు

KNR: డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏషియన్ పెయింట్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. లోడింగ్, అన్లోడింగ్ హమాలీ ఛార్జీలు చెల్లించాలని, డ్రైవర్లందరికీ ఇన్సూరెన్స్, రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. సీఐటీయూ, ఏషియన్ పెయింట్స్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 02:34 PM IST

అభివృద్ధికి బాటలు వేయాలి: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

MDK: నర్సాపూర్ పురపాలిక నూతన పాలకవర్గం తొలి సమావేశం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన సోమవారం ఉత్సాహంగా సాగింది. తొలుత కౌన్సిలర్లు, సిబ్బంది మధ్య పరిచయ కార్యక్రమం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు.

February 23, 2026 / 02:32 PM IST

‘నిందితులను వెంటనే శిక్షించాలి’

NRPT: ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన దారుణాన్ని వ్యతిరేకిస్తూ మక్తల్ మండలం చిట్యాల గ్రామంలో సోమవారం రజక, ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం చిన్నారి ఫొటోకు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడిని వెంటనే చట్టరీత్యా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.

February 23, 2026 / 02:32 PM IST