PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో మహిళా గ్రామైక్య సంఘం నూతన భవన నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మేడారం వీర్ పాల్, ఎంపీడీవో సుమలత టెంకాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి మౌనిక, ఐకేపీ ఎపీఎం, మహిళా సంఘాల ప్రతినిధులు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
SRCL: తంగళ్లపల్లి మండలంలోని కాలేశ్వరం ప్రాజెక్టు ఎల్‌ఎంసీ 11/6, 11/5, 11/4 కాల్వల పెండింగ్ పనులు తక్షణం పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని మండల సర్పంచులు జిల్లా కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పుర్మాని రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో జ్యోతి అనిల్, అంచ శ్రీనివాస్ రెడ్డి, సాయికృష్ణ గౌడ్, పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.
NGKL: నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామానికి మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రానున్నారు. ఇటీవల కులవివక్షకు గురైన బాధితులను ఆయన పరామర్శిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు.
MDCL: అల్వాల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో సోమవారం 6వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి దేవతారాధన విశేష అభిషేకాలు చేసిన, ఆలయ కమిటీ సభ్యులు చివరి రోజు మంగళవారం మహా పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, సంప్రోక్షణ, తీర్థ ప్రసాద, మహా అన్న ప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
MDK: నిజాంపేటలో నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం కార్యాలయం శిథిలావస్థకు చేరిన పెంకుటింట్లో కొనసాగుతున్న నేపథ్యంలో, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి దానం చేసిన స్థలాన్ని ఆయన సందర్శించారు. భవన నిర్మాణానికి సంబంధించి తక్షణమే నివేదికలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు.
MHBD: కొత్తగూడ మండలకేంద్రంలో సోమవారం పలు అభివృద్ధి పనులను సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ కొబ్బరికాయను కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, చేసిన పనులు నాణ్యతతో ఉన్న సంవత్సరాల తరబడి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు.
KNR: శంకరపట్నం మండలంలో నాగూర్ (కర్నూలు జిల్లా) కొమ్మెర గ్రామంలో జరిగిన పసిపాప మృతి ఘటనను నిరసిస్తూ మండల రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘం మండల అధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొనగా, రాస్తారోకోతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
MHBD: తొర్రూరు మండలంలోని పోలేపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల రామ్మూర్తి మాతృమూర్తి పయ్యావుల ఐలమ్మ (65) గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న తొర్రూరు మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ ఐలమ్మ పార్టీదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రాగడ సానుభూతి తెలిపారు.
BDK: చర్ల మండల మేజర్ పంచాయతీ పరిధిలో రాజయ్య నగర్, సాయి నగర్, మధ్యలో గల డంపింగ్ యార్డ్‌ను తొలగించాలని సోమవారం సీపీఎం పార్టీ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నేతలు మాట్లాడుతూ.. 2011 నుంచి సీపీఎం పార్టీ అధ్యర్యంలో అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దని అనేకసార్లు అధికారులకు వినతులు అందించిన ప్రయోజనం లేదని మండిపడ్డారు.
MBNR: బాలానగర్ మండలం పెద్దయిపల్లిలో రూ.50 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, హైమాస్ట్ లైట్ల పనులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం అని, దశలవారీగా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
MDCL: అల్వాల్‌లో అభివృద్ధి పనులు వేగవంతం కావాలనే ఉద్దేశంతో సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగిస్తామని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం హెచ్ఎం డబ్ల్యూ SSB అధికారులు ఈడి పంకజ, GM సునీల్‌లను కలిసి అల్వాల్ ప్రాంతానికి మంజూరైన పెండింగ్‌లో ఉన్న తాగునీరు, మురుగు కాలువల పనులపై విస్తృతంగా చర్చించారు.
BHNG: చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం నూతన భవనానికి మార్చినట్లు తహశీల్దార్ వీరాబాయి తెలిపారు. పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేసిన కొత్త కార్యాలయంలో సోమవారం నుంచి సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రెవెన్యూ పనుల కోసం వచ్చే ప్రజలు పాత భవనానికి కాకుండా కొత్త భవనానికే రావాలని ఆమె సూచించారు. మార్పును గమనించాలని తెలిపారు.
SRD: జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు 123 పరీక్షా కేంద్రాల్లో 24,658 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరీక్ష ఏర్పాట్లపై సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు.
ASF: రెబ్బెన మండలంలో ఇవాళ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. చేతికి వచ్చిన పత్తి పంట తడిసి ముద్దవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకస్మికంగా కురిసిన ఈ వర్షం వల్ల పంట నేలపాలైందని, పెట్టుబడి కూడా దక్కేలా లేదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తడిసిన పత్తిని కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.