• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పేకాట స్థావరంపై దాడి.. పలువురు అరెస్ట్

ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరా నగర్‌లో పేకాట స్తావరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో గోలి వెంకటేష్, గడ్డం లక్ష్మణ్, గుర్లే రవీందర్ పట్టుబడగా మరో ఆరుగురు పరారయినట్లు తెలిపారు. సంఘటన స్థలంలో రూ. 12,040 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు SI వెంకట కృష్ణ పేర్కొన్నారు.

February 24, 2026 / 08:41 PM IST

విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

HNK: హన్మకొండలోని వాగ్డేవి కళాశాల విధ్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ “అరైవ్ అలైవ్” ఏర్పాటు చేశారు. CP సన్ ప్రీత్ సింగ్ హాజరై మాట్లాడుతూ.. వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలను తీసుకుంటూ వాహనం నడపాలని అన్నారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామంటూ విద్యార్థుల చేత ట్రాఫిక్ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు.

February 24, 2026 / 08:41 PM IST

అనుమతులకు మించిన నిర్మాణాలు.. చర్యలేవి..?

MDCL: కూకట్‌పల్లి పరిధి గోపాల్ నగర్ ఏరియాల్లో అనుమతులకు మించిన నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడికి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకంగా జోనల్ కమిషనర్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదన్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఎందుకు, నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

February 24, 2026 / 08:40 PM IST

కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

HNK: కలెక్టర్ కార్యాలయం ఎదుట డెస్క్ జర్నలిస్టులు మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధు మాట్లాడుతూ.. గతంలో విధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేశారో అదేవిధంగా కార్డులు మంజూరు చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.

February 24, 2026 / 08:40 PM IST

రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

KMR: బీబీపేట మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో రజకులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రజక సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 08:38 PM IST

ఇసుక స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలి: ఎమ్మెల్యే

BHPL: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఐడీవోసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, టీజీ ఎండీసీ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ఇందిరమ్మ ఇళ్లుకు ఇసుక సరఫరా, కొడవటంచ దేవాలయ జాతర ఏర్పాట్లు, రైతులు యూరియా కొరకు యాప్ ద్వారా బుకింగ్‌ చేయుట తదితర అంశాలపై సమీక్షా నిర్వహించారు.

February 24, 2026 / 08:36 PM IST

‘ఉపాధి హామీ పనులను సక్రమంగా నిర్వహించాలి’

SRPT: చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గొర్రెలు, మేకల షెడ్లను, మంగళవారం సూర్యాపేట జిల్లా జడ్పీ ఇన్‌ఛార్జ్ సీఈవో శిరీష పరిశీలించారు. పనుల వివరాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కల రక్షణకు షెడ్ నెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

February 24, 2026 / 08:36 PM IST

ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

ADB: జిల్లా కేంద్రంలోని ఏరోడ్రమ్ ప్రాంతంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఎన్ని ఎకరాలు ఎక్కడి వరకు ఎన్ని భూములు వెళ్తున్నాయో మ్యాప్ ఆధారంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపళ్లి గంగాధర్ రావు, కౌన్సిలర్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 08:32 PM IST

‘ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి’

MHBD: బయ్యారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కళాశాల ప్రిన్సిపల్ పర్యవేక్షణలో పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను ఏర్పాటు చేశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

February 24, 2026 / 08:32 PM IST

మదర్ డెయిరీ సమస్యలపై ఎమ్మెల్యేల సమీక్ష సమావేశం

NLG: మదర్ డెయిరీలో నెలకొన్న సమస్యలపై ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో MLAలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని డెయిరీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. డెయిరీ ఎదుర్కొంటున్న సవాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

February 24, 2026 / 08:31 PM IST

జిల్లాలో నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవు: ఎస్పీ

WNP: మైనర్ మానసిక వికలాంగురాలిపై జరిగిన అత్యాచార కేసులో నేరం రుజువవ్వడంతో నిందితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా, కఠిన తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. ఇలాంటి కఠిన తీర్పులు సమాజానికి రక్షణ కవచం లాంటివి అన్నారు. ఏ అన్యాయం జరిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సునీత రెడ్డి అన్నారు.

February 24, 2026 / 08:30 PM IST

సర్పంచుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

WGL: గీసుకొండ (M) కేంద్రంలోని గంగాదేవి పల్లె గ్రామంలో నల్లబెల్లి మండలానికి చెందిన సర్పంచుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేయాలని సర్పంచులను కోరారు.

February 24, 2026 / 08:30 PM IST

‘ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు’

JGL: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు, పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. క్రమశిక్షణ, సమయపాలన పాటించి కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, హాల్ టికెట్ వెంట తీసుకెళ్లాలని తెలిపారు.

February 24, 2026 / 08:28 PM IST

అక్రమ ఇసుక రవాణా.. ఐదు ట్రాక్టర్ల స్వాధీనం

KNR: అనుమతి లేకుండా మానేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను మగ్దుంపూర్ వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాతో పాటు, పునరావృతమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

February 24, 2026 / 08:28 PM IST

బాధిత కుటుంబానికి CMRF చెక్కు పంపిణీ

WNP: రేవల్లి మండల తలుపునూరు గ్రామానికి చెందిన కౌసల్య అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమెకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారంతో CMRF మంజూరికి దరఖాస్తు చేసుకోగా రూ. 32 వేలు మంజూరయ్యాయి. మంజూరైన చెక్కును మంగళవారం ఎమ్మెల్యే వనపర్తిలోని తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు.

February 24, 2026 / 08:23 PM IST