• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బీజేపీ నేతల అరెస్టులపై నిరసన

BHNG: బీజేపీ రాష్ట్ర నాయకులపై జరుగుతున్న అక్రమ అరెస్టులను ఖండిస్తూ జిల్లా కేంద్రం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊటుకోరి అశోక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడాలని, రాజకీయ వేధింపులు వెంటనే ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

February 23, 2026 / 07:29 PM IST

నిధుల అక్రమాలపై ప్రజావాణిలో ఫిర్యాదు

KNR: శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన ముదిగంటి విజయలక్ష్మి అకౌంట్లో, అదే గ్రామానికి చెందిన సీఏ కొత్త లక్ష్మి అక్రమంగా సీఎంఆర్ రిలీఫ్ చెక్కు ద్వారా డబ్బులు వేయించిందని బాధితురాలు ఆరోపించారు. ఈ క్రమంలో తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసిన అధికారిపై, నిధుల అక్రమాలకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

February 23, 2026 / 07:29 PM IST

ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్

PDPL: జిల్లాలో ఈనెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఇవాళ సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. 22 కేంద్రాలలో 10,367 మంది పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థిని పరీక్ష కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు.

February 23, 2026 / 07:27 PM IST

పార్కులో పారిశుద్ధ్య పనులు ప్రారంభం

RR: వార్డు అభివృద్ధి విషయంలో నిరంతరం ప్రజల వెంట ఉంటానని షాద్‌నగర్ పట్టణ ఆరవ వార్డు కౌన్సిలర్ రాజు నాయక్ అన్నారు. బాబా నగర్ కాలనీలోని పార్క్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పార్కును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.

February 23, 2026 / 07:25 PM IST

పోలీస్​ ప్రజావాణిలో వినతులు స్వీకరించిన సీపీ

NZB: నగరంలోని సీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్​ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ ప్రజావాణిలో 30 ఫిర్యాదులు నమోదయ్యాయి. బాధితుల సమస్యలు విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

February 23, 2026 / 07:22 PM IST

ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: SFI

MHBD: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని MHBD జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతి బాసు పట్ల మధు డిమాండ్ చేశారు. MHBD జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో SFI ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు.

February 23, 2026 / 07:21 PM IST

ఫ్లోరైడ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో ఇవాళ అశోక్ నగర్ డీఫ్లోరైడ్ ప్రాజెక్టుపై మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. వేసవికాలంలో పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని కోరారు.

February 23, 2026 / 07:19 PM IST

చిన్నారి కుటుంబానికి న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే

NGKL: కుమ్మెర ఘటనపై అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ స్పందిస్తూ, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చిన్నారి మృతి అత్యంత బాధాకరమని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

February 23, 2026 / 07:17 PM IST

‘సేవ భావంతో పనిచేసే కార్యకర్తలే పార్టీకి బలం’

BHPL: జిల్లా BJP కార్యాలయంలో ఇవాళ BJP జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి అధ్యక్షతన ‘పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్–2026’ జిల్లా స్థాయి కార్యశాల జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ధర్మారావు హాజరై మాట్లాడారు. క్రమశిక్షణ సంస్థకు మూలాధారమని, సిద్ధాంత నిబద్ధత, నిస్వార్థ సేవా భావంతో పనిచేసే కార్యకర్తలే పార్టీకి బలమన్నారు.

February 23, 2026 / 07:16 PM IST

నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

WNP: జిల్లాలో కొనసాగుతున్న ప్రభుత్వ భవన నిర్మాణ పనులు, పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సో మనం వనపర్తి కలెక్టరేట్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న వివిధ నిర్మాణ పనులపై సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలో తలపెట్టిన నిర్మాణ పనులను మార్చి 15లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

February 23, 2026 / 07:15 PM IST

‘విద్యార్థుల్లో సైన్స్ పట్ల మక్కువ పెరుగుతుంది’

NRML: పట్టణంలోని ఓ పాఠశాలలో సోమవారం జిల్లా ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లాస్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈవో భోజన్న హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. టాలెంట్ టెస్ట్ ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల మక్కువ పెరుగుతుందని, కఠినతరమైన అంశాలపై నైపుణ్యత వస్తుందని అన్నారు.

February 23, 2026 / 07:15 PM IST

రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం అండ: కలెక్టర్

SRPT: కర్ల రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో చేయూత అందిస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ హామీ ఇచ్చారు. సోమవారం రాజేష్ తల్లి లలితమ్మను కలెక్టర్ కోదాడలోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కర్ల రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

February 23, 2026 / 07:09 PM IST

బాల్యవివాహాలను అడ్డుకోవాలి: ఎంపీడీవో

NLG: నేరేడుగొమ్ము ఎంపీడీవో కార్యాలయంలో మండల అధికారులతో బేటి బచావో బేటీ పడావో కార్యక్రమంపై ఎంపీడీవో జయరామ్ విజయ్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ చంద్రకళ ఎమ్మార్వో ఉమాదేవి, ఎంఈఓ, పోలీస్ సిబ్బంది పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శోభ పాల్గొన్నారు.

February 23, 2026 / 07:07 PM IST

కామారెడ్డి డీఎంహెచ్​వోగా రవీందర్ గౌడ్

KMR: కామారెడ్డి డీఎంహెచ్​వోగా డాక్టర్ రవీందర్ గౌడ్​ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్​మెంట్​ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం ఆయన డీఎంహెచ్​వోగా ఛార్జ్​ తీసుకున్నారు. అనంతరం కార్యాలయం సిబ్బందితో సమావేశం అయ్యారు. సర్వీస్​లోనే ఉంటూ 2006 నుంచి 2009 వరకు ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

February 23, 2026 / 07:06 PM IST

‘ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు’

MNCL: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్ లోని కలక్టరేట్ లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

February 23, 2026 / 07:03 PM IST