• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

NZB: విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అదేవిధంగా సౌమ్య తమ్ముడు గాజుల శ్రవణ్​కు ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్​గా ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా సోమవారం అందించారు.

February 23, 2026 / 01:24 PM IST

ఈఎన్టీ సర్జన్‌కు అబ్దుల్‌ కలాం ఎక్సలెన్స్‌ అవార్డు

హైదరాబాద్ హెచ్‌ఐటీఎక్స్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈఎన్టీ సర్జన్ డాక్టర్ లవణం కళ్యాణ్ వరప్రసాద్‌ అవార్డు అందుకున్నారు. యాక్ట్‌ నౌ వాలంటరీ ఆర్గనైజేషన్ ఛైర్మన్ డాక్టర్ కే.ఎస్ మూర్తి చేతుల మీదుగా డాక్టర్ ఒటో- లారిన్జాలజీ హెల్త్‌కేర్‌‌లో ఉత్తమమైన సేవలను అందించినందుకుగాను ఆయనకు ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు లభించింది.

February 23, 2026 / 01:24 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

NRPT: మరికల్ మండల కేంద్రం మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షులు పెంట మీద నారాయణ కుటుంబాన్ని సోమవారం రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరమర్శించారు. నారాయణ మృతి కాంగ్రెస్ పార్టీకి, మత్స్య సహకార సంఘానికి తీరని లోటు అన్నారు. నారాయణ సేవలను కొనియాడారు. సర్పంచ్ చెన్నయ్య, పాలమూరు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పెద్ద విజయ్ కుమార్, సూర్య మోహన్ రెడ్డి ఉన్నారు.

February 23, 2026 / 01:24 PM IST

బోర్డ్ సరే.. క్రీడా ప్రదేశమేది..?

MDK: అల్లాదుర్గం మండలంలోని గొల్లకుంటతండా గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం నిరుపయోగంగా మారింది. రోడ్డుకు ఆనుకొని క్రీడా ప్రాంగణం అనే పేరు గల బోర్డును తగిలించారు. ఓ వ్యవసాయ చేనులో ఏర్పాటు చేయడంతో ఆ రైతు చేను దున్నుకోవడం వల్ల యువకులు క్రీడలకు దూరమవుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాన్ని వినియోగంలోకి తీసుకురావలన్నారు.

February 23, 2026 / 01:24 PM IST

కొంపల్లిలో సైబరబాద్ మున్సిపల్ కమిషనర్ పర్యటన

HYD: కొంపల్లి సర్కిల్-56లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పారిశుధ్య తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికీ చెత్త సేకరణ ప్రత్యామ్నాయ రోజుల్లో జరుగుతున్నట్లు గుర్తించి, ఇకపై ప్రతిరోజూ డోర్ టు డోర్ కలెక్షన్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ఎస్ఏటీ వాహనాలకు చెత్త ఇవ్వని గృహాలను గుర్తించి అవగాహన కల్పించడంతో పాటు పునరావృతమైతే జరిమానా విధించాలన్నారు.

February 23, 2026 / 01:22 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టి బొమ్మ దగ్ధం

KNR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును హౌస్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం చొప్పదండిలో బీజేపీ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ తోపులాట జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలన సాగుతోందని నినాదాలు చేశారు.

February 23, 2026 / 01:20 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతను ఇవ్వాలి’

MBNR: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవో అనిల్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

February 23, 2026 / 01:20 PM IST

నల్గొండలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

NLG: ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 48 కేంద్రాలలో మొత్తం 27,905 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని జిల్లా ఇంటర్ అధికారి దస్రు నాయక్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించారు.

February 23, 2026 / 01:19 PM IST

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

NGKL: ఊర్కొండ మండలం జగబోయిన్‌ పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి రూ.5,000 నగదును అందజేశారు. భవిష్యత్తులో బాధిత కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని ధ్యాప నిఖిల్ రెడ్డి భరోసా ఇచ్చారు.

February 23, 2026 / 01:18 PM IST

సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

BDK: ఆళ్లపల్లి మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని కళ్యాణ లక్ష్మీ, సీఎం  సహాయ నిధి (CMRF) చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మీ పథకం కింద 24 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 24,02,784 పంపిణీ చేసి, పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించారు.

February 23, 2026 / 01:16 PM IST

‘రైతులందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి’

SDPT: ప్రభుత్వం అందించే పథకాలు,సబ్సిడీలు అందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేయించుకోవాలని కౌన్సిలర్ వనం రమేష్ సూచించారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట వార్డు కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన సోమవారం పరిశీలించారు. ఇంకా నమోదు చేసుకోని రైతులు వెంటనే స్పందించి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

February 23, 2026 / 01:16 PM IST

ప్రత్యేక అలంకరణలో కాళికా దేవి

MDK: కాళికా మాత ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకుని సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని కాళికా మాత ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అర్చకులు ఆశీస్సులు అందజేసి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.

February 23, 2026 / 01:14 PM IST

డీఆర్‌వో సంగీతకు జర్నలిస్టుల వినతి

RR: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డీఆర్‌వో సంగీతకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఉన్న జిల్లానే కాకుండా తెలంగాణ ఎర్త్ వైడ్ ఫ్రీ బస్సు పాస్ ఇవ్వాలన్నారు.

February 23, 2026 / 01:13 PM IST

మంత్రిని కలిసిన కల్వకుర్తి వైస్ ఛైర్మన్

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బృంగి ఆనంద్ కుమార్ ఇవాళ హైదరాబాదులోని మంత్రి జూపల్లి కృష్ణారావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైస్ ఛైర్మన్‌ను మంత్రి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కల్వకుర్తి అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు.

February 23, 2026 / 01:10 PM IST

ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా జైనథ్ రాస్తారోకో

ADB: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యాలయంపై దాడిని ఖండిస్తూ జైనథ్ బీజేపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. బస్టాండ్ ఆవరణలో గంటపాటు ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

February 23, 2026 / 01:09 PM IST