BDK: కొత్తగూడెం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తు గడువును మరో 10 రోజులు పొడిగించాలని ఆటో వర్కర్స్ యూనియన్ రామవరం అధ్యక్షుడు SK జలీల్ సోమవారం కోరారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి సమయమివ్వాలని, ఆటో సోదరుల కోసం ప్రత్యేక కోటా ఏర్పాటు చేయాలని కోరారు.
JN: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపం చెంది ఏఆర్ కానిస్టేబుల్ ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన గుగులోతు నీల (26) వరంగల్ హెడ్ క్వార్టర్స్లో ఏఆర్ కానిస్టేబుల్ పని చేస్తున్నారు. పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
HYD: అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ఫైర్ సిబ్బంది అందించే సేవలు అభినందనీయమని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ఆదివారం తార్నాకలోని తన నివాసంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాన్ని పోస్టర్ను ఆవిష్కరించారు. అగ్నిప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
NLG: ఇవాళ నల్గొండ పురపాలికలోని 19వ వార్డు, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నల్గొండలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిల సమక్షంలో సుమారు 200 మంది గులాబీ కండువా కప్పుకున్నారు.
MDK: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలలకు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ ఆదివారం ఓ ప్రకటన లో తెలిపారు. 22వ తేదీన విద్యార్థులకు వార్షిక పరీక్ష ఫలితాలు ఇవ్వాలని పేర్కొన్నారు. జూన్ 12వ తేదీన తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని చెప్పారు.
HYD: ఓ వ్యక్తి పై కొంతమంది కత్తులతో దాడికి దిగిన ఘటన అత్తాపూర్ PS పరిధిలో జరిగింది. స్థానికుల ప్రకారం.. అత్తాపూర్ పరిధిలోని ఖాజానగర్కు చెందిన సయ్యద్ బాబాపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏంబీటీ స్పోక్స్ పర్సన్ బాధితుడిని పరామర్శించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
JGL: జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. చివరి రోజైన ఆదివారంపెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కల్యాణకట్టలో దీక్షాపరులు మాలవిరమణ చేసి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తమ స్వస్థలాలకు తిరుగుపయనమయ్యారు.
NRML: నర్సాపూర్ మండలంలోని తురాటీ, చాక్పల్లి గ్రామాల వద్ద ఉన్న హైవే 61 రహదారిపై నిర్మించిన స్పీడ్ బ్రేకర్ లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత 21 రోజులలో ఒకేచోట నాలుగు ప్రమాదాలు జరిగాయి. అందులో ఇద్దరు మరణించగా మిగతా ఇద్దరు తీవ్ర గాయాలతో హాస్పటల్ పాలయ్యారు. అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని స్థానికులు కోరారు.
MHBD: డోర్నకల్-భద్రాచలం రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ఎట్టకేలకు అనుమతి లభించింది. 2008లో ప్రారంభమైన ప్రతిపాదనలు పలు కారణాలతో ఆగిపోయాయి. ఈ లైన్తో దూరం తగ్గడంతోపాటు గూడ్స్ రవాణా, హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చే ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో రైల్వేశాఖ డబ్లింగ్ పనులకు పచ్చజెండా ఊపింది.
KMM: విద్యరంగ అభివృద్ధికి ఉపాధ్యాయుల సంక్షేమానికి నిరంతరంగా పోరాడే సంఘం TSUTF అని సంఘం నాయకులు నాగరాజు, వినోద్ రావు, లక్ష్మణ్ రావు అన్నారు. ఆదివారం మధిర UTF కార్యాలయంలో టీఎస్ యుటిఎఫ్ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాగా నూతన విద్యా విధానంలోని అశాస్త్రీయ, కార్పొరేటీకరణ, మతీకరణ దోరణులను వాటి వ్యత్యాసాలను ప్రమాదాలను వివరించారు.
HNK: ఏల్కతుర్తి మండల కేంద్రంలోఈ నెల 27 వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ వేదికకు వాహనాల పార్కింగ్ స్థలాన్ని ఆదివారం పరిశీలించిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు , కార్యకర్తలు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.
NLG: కలర్ ల్యాబ్ యజమాని సురేష్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓ మహిళతో పాటు ముగ్గురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. HYDకు వెళ్లి ఓ మహిళతో పాటు ఇద్దరు అనుమానితులు, NKLకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
SRD: సైబర్ నేరాలను అరికట్టేందుకు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిన్నారం ఎస్సై నాగలక్ష్మి అన్నారు. శనివారం జిన్నారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జీపీ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచితే తద్వారా సైబర్ నేరాలను నియంత్రించే అవకాశం ఉంటుందన్నారు. కార్యదర్శి మాణిక్యం, సిబ్బంది ఉన్నారు.
SRD: మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి దేవుజ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి, ఆరవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం www.tmreis.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు సమీపంలోని మైనార్టీ పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.
NRML: నర్సాపూర్ జి మండలం తురాటి సమీపంలో శనివారం సాయంత్రం బస్సు లారీ ఢీకొన్న ఘటన విషయం తెలిసిందే. కాగా తీవ్ర గాయాల పాలైన లారీ డ్రైవర్ను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.