ASF: విద్యుత్ ప్రమాదాలను నివారణ, క్షేత్రస్థాయిలో ఉద్యోగుల భద్రత కోసం లైన్ క్లియర్(LC) యాప్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆసిఫాబాద్ SE ఉత్తమ్ జాడే ప్రకటనలో తెలిపారు. LC యాప్‌తో డిజిటల్ పద్ధతిలో అనుమతులు జారీ అవుతాయని పేర్కొన్నారు. ఫీడర్, పంపిణీ లైన్ వివరాలు స్పష్టంగా ఉంటాయని, తప్పుడు ఫీడర్ ఎంపికకు అవకాశం లేకుండా అప్రమత్తం చేస్తుందన్నారు.
NLG: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా బడ్జెట్‌లో మొత్తం మోసం చేశారని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు..
SDPT: గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేసి, నేడు ఏ మొహం పెట్టుకొని సిద్దిపేటకు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ వెటర్నరీ కళాశాల, రంగనాయక సాగర్ టూరిజం, శిల్పారామం, ఔటర్ రింగ్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టులకు నిధులను అర్ధాంతరంగా నిలిపేశారని మండిపడ్డారు.
NZB: ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలో ఈ నెల 29న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు గుండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. హిందూ సమ్మేళనానికి కుటుంబ సమేతంగా విచ్చేసి, హిందూ చైతన్యం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ క్షేత్రాల హిందూ యువత పాల్గొన్నారు.
SRPT: కోదాడ పట్టణంలో రంజాన్ వేడుకలు ఒక్కసారిగా విషాదంగా మారాయి. మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండలో శనివారం ఓ ఇంట్లో పండుగ సందర్భంగా బిర్యానీ చేస్తుండగా గ్యాస్ లీకేజీ జరిగి, ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే అగ్నిజ్వాలలు ఇల్లు మొత్తాన్ని కమ్మేసి, కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేశాయి. ఈ ప్రమాదంలో షేక్ నాగుల్ తీవ్రంగా గాయపడ్డారు.
HYD: MNJ క్యాన్సర్ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో ఊపిరితిత్తులు, ఉదరం సంబంధిత క్యాన్సర్ కేసులు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. 2025లో ఊపిరితిత్తుల క్యాన్సర్ 785 మందిలో, ఉదరం సంబంధిత క్యాన్సర్ 445 మందిలో గుర్తించారు. నోటి, గొంతు క్యాన్సర్లు అధికంగా నమోదవుతున్నాయి. జీవనశైలి మార్పులు, పొగ త్రాగడం, మద్యం సేవనం వంటి అలవాట్లు ప్రధాన కారణాలు అని వైద్యులు తెలిపారు.
వనపర్తి మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తై బజార్, పశువుల సంత, జంతు వధశాల వేలం ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు ఛైర్ పర్సన్ మిడిదొడ్డి మాధవి తెలిపారు. ఆసక్తి గలవారు తై బజార్ కోసం రూ.2 లక్షలు, సంత, వధశాల కోసం చెరో రూ.50 వేలు డిపాజిట్ చేయాలని సూచించారు.
ADB: గృహ వినియోగానికి కేటాయించిన LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించరాదని సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీతో ప్రజలకు అందిస్తున్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్‌లో వినియోగించడం చట్ట విరుద్ధమని అన్నారు. ఇటువంటి చర్యలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమే కాకుండా ప్రజల ప్రాణ భద్రతకు కూడా ముప్పు కలిగిస్తాయని తెలిపారు.
NGKL: బల్మూర్ మండలం రంగాపూర్ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయాన్ని ప్రముఖ సినీ నటుడు సుప్రీత్ రెడ్డి (ఛత్రపతి కాట్రాజు) దర్శించుకున్నారు. శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు, ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో భాగంగా శనివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సీతారాముల స్వామి వారికి పంచోపా నిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. రామాయణ పారాయణం, రామాయణ ప్రవచనం ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
MDCL: రామంతాపూర్ భగాయత్ వెంకట సాయి నగర్ కాలనీలో కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ వద్ద రాత్రి చీకటి కారణంగా మహిళల భద్రత సమస్యలు తలెత్తుతున్నాయి. ఈమేరకు అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు. హైమాస్ట్ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని కోరగా, సమస్యను త్వరలో పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
KNR: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయనామ సంవత్సరం అని ప్రకటించి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కోత పెట్టడం విస్మరించడమేనని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి విమర్శించారు. శంకరపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయనామ సంవత్సరంగా ప్రకటించిన CM బడ్జెట్‌లో మాత్రం కోత విధించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.
KMM: నేరాల నియంత్రణలో భాగంగా అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ఖమ్మం జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నిన్న తెలిపారు. ఏటియం సెంటర్లు, బ్యాంకుల పరిసరాలలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి వేళలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను, వాహనాలను తనిఖీ చేశారు.
NRPT: ఊట్కూరు మండలం నిడుగుర్తికి చెందిన డాక్టర్ కౌండిన్య శ్రీజ గౌడ్ అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించారు. HYDలోని కామినేని ఆసుపత్రిలో MBBS పూర్తి చేసిన ఆమె, 2025 DECలో నిర్వహించిన USMLE స్టెప్-2 పరీక్షలో 300 మార్కులకు గానూ 252 మార్కులు సాధించి మెరుగైన ప్రతిభ కనబరిచారు.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారిపై భారీ గుంతలు ఏర్పడిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక 15 రోజులుగా గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బంది ఏర్పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతలు పూడ్చి రోడ్డు మరమ్మతు చేయాలని కోరుతున్నారు.