• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సీసీ రోడ్డును పరిశీలించిన మున్సిపల్ ఛైర్మన్

SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో కూలిపోయిన సీసీ రోడ్డును శనివారం సాయంత్రం మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు పరిశీలించారు. గత కొద్ది రోజుల క్రితం సీసీ రోడ్డు కూలిపోవడంతో ఈ విషయమై స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన పరిశీలించి, మరమ్మతు చేపట్టాలని అధికారులకు సూచించారు.

March 22, 2026 / 04:16 AM IST

‘ప్రజానాట్యమండలి మహాసభలను జయప్రదం చేయండి’

నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవనంలో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ మేరకు రాష్ట్ర నాయకుడు నాగార్జున మాట్లాడుతూ.. ప్రజా కలల పరిరక్షణ కోసం ఉద్యమించాలని అన్నారు. వచ్చేనెల 6, 7 తేదీల్లో నల్గొండలో నిర్వహించే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. తదనంతరం ఆ మండలి నూతన డైరీ ఆవిష్కరణ చేశారు.

March 21, 2026 / 10:22 PM IST

రాష్ట్ర బడ్జెట్‌లో వరంగల్‌కు నిరాశే: మాజీ ఎమ్మెల్యే

WGL: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు అన్యాయం జరిగిందని శనివారం నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు లేకుండా పాత పనులకే పరిమితమైందని, యూజీడీ, మామునూరు వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు. దీనిపై సీఎం స్పందించి జిల్లా అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరారు.

March 21, 2026 / 09:59 PM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం..!

BDK: ఇల్లందు మండలం మసివాగు గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు, ఆటో వేగంగా ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వారిని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 21, 2026 / 09:46 PM IST

హిందూ సమ్మేళన పోస్టర్ల ఆవిష్కరణ

MDCL: అల్వాల్ ఇందిరా నగర్ కాలనీలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శనివారం హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నిమ్మ చిరంజీవి రెడ్డి సహా నిర్వాహకులు, సభ్యులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరూ సమ్మేళనానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు.

March 21, 2026 / 09:29 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క

MHBD: గంగారం మండలం దుబ్బగూడంలో జనగాం పాపారావు తల్లి ఇటీవల మృతి చెందడంతో శనివారం మంత్రి సీతక్క ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గంగారం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

March 21, 2026 / 09:24 PM IST

‘పంట నష్టంపై క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలి’

BDK: వడగండ్ల వాన ఈదురుగాలులకు దెబ్బతిన్న మొక్కజొన్న పంట నష్టానికి రైతులకు తక్షణమే పరిహారం అందేలా ప్రభుత్వంపై వత్తిడి తెస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యం వల్ల మొక్కజొన్న పంటకు జరిగిన భారీ నష్టంపై ఆయన మాట్లాడుతూ.. తక్షణమే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని అదేశించారు.

March 21, 2026 / 09:22 PM IST

యాదగిరిగుట్ట-రాజపేట ప్రధాన రహదారి బంద్

BHNG: కాల్వపల్లి బ్రిడ్జి వద్ద పైపుల దగ్గర కుంగి రాకపోకలకు అంతరాయం జరిగింది. పొట్టిమర్రి ఉధృతికి రాజపేట-యాదగిరిగుట్ట ప్రధాన రహదారి కోతకు గురై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హై లెవెల్ బ్రిడ్జ్ పనుల వద్ద కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్లే తాత్కాలిక మట్టి రోడ్డు పట్టుకుపోయిందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. దీంతో పోలీసులు దారిని మూసివేయడం మూసివేశారు.

March 21, 2026 / 09:20 PM IST

‘ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు.. బుక్ చేసుకోండి’

HYD: భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించిన పవిత్ర తలంబ్రాలను భక్తుల ఇళ్లకు పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని సికింద్రాబాద్ డివిజన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ పవిత్ర తెలిపారు. భక్తులు ముందుగా బుకింగ్ చేసుకోవాలన్నారు. బుకింగ్ కోసం 9010334184, 9154208831 నంబర్లను సంప్రదించాలని సూచించారు. శ్రీ సీతారాముల ఆశీస్సులు పొందే అవకాశం మిస్ కావొద్దని పవిత్ర తెలిపారు.

March 21, 2026 / 09:08 PM IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10వ ప్లాట్‌ఫారం ఓపెన్

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 10వ ప్లాట్‌ఫారం వచ్చే నెలలో అందుబాటులోకి రానుందని SCR అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల కోసం ఈ ప్లాట్‌ఫారం నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. అయితే భద్రతా వ్యవస్థకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాకే పూర్తి స్థాయిలో ప్రారంభం చేయనున్నారు. మరో వైపు స్కానింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు.

March 21, 2026 / 09:07 PM IST

భీంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు

HNK: కమలాపూర్(M) భీంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలను ఇవాళ నిర్వహించారు. హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జి ప్రణవ్, మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ ఝాన్సీరాణి రవీందర్, స్థానిక సర్పంచ్ వాసాల శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులను సన్మానించారు. ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని వారు అన్నారు.

March 21, 2026 / 09:06 PM IST

పాత బ్యాచ్ విద్యార్థులకు మరోసారి అడ్మిషన్

HYD: డాక్టర్ B.R అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1986 నుంచి 2013 వరకు డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) పూర్తి చేయలేకపోయిన పాత బ్యాచ్ విద్యార్థులకు మరోసారి అడ్మిషన్ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మధ్యలో చదువు ఆపేసిన వారికి ఇది మంచి అవకాశంగా నిలుస్తుంది. నిర్దిష్ట నిబంధనలతో తిరిగి నమోదు చేసుకుని మిగిలిన సబ్జెక్టులు పూర్తి చేసుకునే వీలు ఉంటుంది.

March 21, 2026 / 08:54 PM IST

బడ్జెట్ ప్రతులను తగులబెట్టిన ఏబీవీపీ నేతలు

KNR: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగాన్ని ప్రభుత్వం విస్మరించిందని జిల్లా ఏబీవీపీ కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో బడ్జెట్‌కు వ్యతిరేకంగా ప్రతులను దహనం చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన రూ.3,24,234 కోట్ల పద్దులో విద్యారంగానికి కేవలం 8 శాతం నిధులు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. విద్యారంగానికి పట్టుమని 15% కూడా నిధులు కేటాయించలేదన్నారు.

March 21, 2026 / 08:52 PM IST

MRO కుటుంబానికి MP గోడం నగేశ్ పరామర్శ

ADB: నేరడిగోండ మండలంలోని కుంటాల గ్రామానికి చెందిన సత్నాల తహశీల్దార్ జాదవ్ రామారావు తండ్రి జాదవ్ నిమ్య నాయక్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా MRO కుటుంబాన్ని ఆదిలాబాద్ MP నగేశ్ శనివారం పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

March 21, 2026 / 08:50 PM IST

ఈ ప్రాంతాల్లో రేపు పవర్ కట్

BDK: భద్రాచలం విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు శనివారం తెలిపారు. ఐటీడీఏ రోడ్డు, మెడికల్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ, ఆదర్శనగర్ కాలనీ, సుందరయ్య నగర్ కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రాంతాల్లో పవర్ ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహాకరించాలన్నారు.

March 21, 2026 / 08:49 PM IST