HYD: డిజిటల్ అరెస్టులపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. దాదాపుగా 17 వేలకు పైగా వాట్సాప్ ఖాతాలను హోంమంత్రిత్వశాఖ బ్లాక్ చేసింది. ఇటీవల HYDలోని పలువురు డిజిటల్ అరెస్ట్‌కు గురై రూ. కోట్లు పోగొట్టుకున్నారు. ఎల్బీనగర్, హయత్‌నగర్‌లో ఈ అరెస్టులు జరిగినట్లు తేలింది. వాట్సాప్, ఇన్‌స్టాలో ఫ్రెండ్స్ అయ్యి పర్సనల్, బ్యాంక్ డేటా లాగుతారు. తర్వాత అకౌంట్ ఖాళీ చేస్తారు.
WGL: ధర్మసాగర్ మండలంలోని ఆదివారంనాడు సుస్మిత గార్డెన్‌లో ధర్మసాగర్ మండల కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిదానాల్లో కంటే రక్తదానం ఉన్నతమైనదని అన్నారు. మెగా శిబిరంలో పాల్గొని రక్తదానం చేసినవారికి సర్టిఫికెట్లు అందజేశారు.
BDK: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో లంబాడీ గిరిజనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సేవలాల్ సేనా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా లంబాడీ గిరిజనులు ఆర్థికంగా వెనకబడి ఉన్నారని, వారిని ఆదుకునేందుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
KMR: కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జనవరి నెలలో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. స్నాన గట్టాల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు.
NZB: తెలంగాణ రాష్ట్ర బీసీ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సుదర్శన్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా విట్టల్, కోశాధికారిగా కొండయ్య, ఉపాధ్యక్షులుగా పరిష రాములు, రాజేష్, రవి గౌడ్, వెంకట రాములు, సీనయ్య, సంయుక్త కార్యదర్శిగా రాజకుమార్, కార్యదర్శిగా అజయ్, రమేష్, లక్ష్మణ్, ప్రతినిధిగా రామకృష్ణ ఎన్నికయ్యారు. 33 జిల్లాలకు ఇంఛార్జ్‌లను ఎంపిక చేశారు.
హైదరాబాద్: రంగారెడ్డి, సికింద్రాబాద్, హైదరాబాద్ ట్రయల్ కోర్టుల్లో స్టాండింగ్ కౌన్సెల్ నియామమానికి ఆసక్తి, అర్హత ఉన్న న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ తెలిపింది. రంగా రెడ్డి జిల్లా 8, పటాన్ చెరువు- రామచంద్రాపురం ఒకటి, సికింద్రాబాద్- హైదరాబాద్ ట్రయల్ కోర్టుల్లో 7 చొప్పున ఖాళీగా ఉన్న పోస్టులకు జనవరి 23లోపు జీహెచ్ఎంసీ అందజేయాలన్నారు.
HYD: కూకట్ పల్లి జోన్, మూసాపేట, కూకట్ పల్లి సర్కిళ్ల కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అధికారులు ప్రజా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఫిర్యాదుల అందజేయాలని తెలిపారు.
NGKL: ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా ప్రైవేటు ఉపాధ్యాయుల కమిటీ అధ్యక్షుడు భాస్కర్ అన్నారు. ఆదివారం అచ్చంపేట పట్టణ కేంద్రంలో కమిటీ ఎన్నిక ఏర్పాటు సమావేశం నిర్వహించారు. అధ్యక్షులుగా భాస్కర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడికి ఆరోగ్య కార్డులు, భీమా సౌకర్యం కల్పించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
HYD: కంటోన్‌మెంట్ బోర్డు కార్యాలయ సమావేశ మందిరంలో ఈ నెల 30న బోర్డు పాలకమండలి సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పలు రహదారుల విస్తరణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరపనున్నట్లు తెలిపారు. దీంతోపాటు వివిధ ప్రతి పాదనలపై బోర్డు పాలకమండలి చర్చలు జరిపిన అనంతరం తగు నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
HYD: జనవరి నెల 19న ఘట్ కేసర్ పట్టణంలోని గట్టు మైసమ్మ జాతరను నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఏటా ఎంతో ఘనంగా ఈ జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, ఈ జాతరలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
MBNR: నవాబుపేట మండలంలోని కాకర్ల పహాడ్ గ్రామ సమీపంలో నవాబుపేట- మహబూబ్ నగర్ బీటీ రోడ్డుపై ఆదివారం స్తంభాలను తీసుకుని వెళుతున్న ఓ ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ ట్రాలీ వెనుక భాగం దెబ్బతింది. స్తంభాలు రోడ్డుపైన పడడంతో స్వల్ప ఇబ్బంది అయింది. ఈ ఘటనలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు .
KMM: వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు కార్యక్రమం ఈ నెల 9తో ముగియగా.. దరఖాస్తుల పరిశీలన అనంతరం జిల్లా ఓటర్ల లెక్క తేల్చారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లు 3, 955 మంది కాగా పురుషులు 2, 300, మహిళలు 1655 మంది ఉన్నారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 24 పోలింగ్ బూత్లు ఉన్నాయి. కాగా, సోమవారం తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.
NGKL: రాష్ట్రంలోని జనగామ జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డి జూనియర్ బాలుర ఛాంపియన్ షిప్ పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డి జట్టు ఆదివారం సెమీఫైనల్‌కు చేరుకుంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా కబడ్డి జట్టుకు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముచర్ల జనార్దన్ రెడ్డి, కార్యదర్శి యాదయ్య గౌడ్ అభినందనలు తెలిపారు.
GDWL: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆదివారం వికారాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వారి సతీమణి డా. సబిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.