ములుగు మండలం పత్తిపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరచిన ధరావత్ సరిత-సారయ్య 806 ఓట్ల భారీ మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపొందారు. అలాగే 12 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులను సోమవారం గ్రంథాలయ ఛైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు