NGKL: ఆమ్రాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను మండల పరిషత్ అభివృద్ధి అధికారి జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఈరోజు పనులు ప్రారంభించారు. గ్రామంలోని లబ్ధిదారులు సుజాత, వెంకటేశ్వర్లు మార్కింగ్ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ ఆనంద రెడ్డి, ఏపీవో రఘుమూర్తి, పంచాయతీ కార్యదర్శి విష్ణు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
NGKL: ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శివశంకర్ శనివారం కల్వకుర్తిలో ఛలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా కార్మికులు నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని, వారి హక్కులు, సంక్షేమం కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
NGKL: బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న చారకొండ మండల బీఆర్ఎస్వీ నాయకులను ఈరోజు పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నియంత పోకడలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరుగుతున్న అన్యాయాలు గురించి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు.
NRML: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యుత్ విభాగ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభను కనబర్చారు. వాహనానికి ప్రమాదం జరిగితే తక్షణ సహాయానికి ఆటోమేటిక్‌గా బంధువులకు, పోలీస్ శాఖకు ఇతర సహాయ సంస్థలకు ప్రమాదం జరిగిన స్థలము, సమయము, సమాచారం చేరవేయుటకు విద్యార్థులు రూపొందించిన నమూనాకు ఈ అవార్డు దక్కిందని వారు తెలిపారు.
ADB: జిల్లా కేంద్రంలోని యాపల్ గూడ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి రాజర్షి షా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును కలెక్టర్ పరిశీలించారు. ఎలక్ట్రిసిటీ, తాగునీరు తదితర మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు అందించారు.
SRPT: మోతే మండలం సిరికొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రుల చిత్రపటాలకు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏబీసీడీ ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును చట్టం ఆమోదించడం చరిత్రాత్మక నిర్ణయమని అన్నారు.
SRD: పదవ తరగతి హిందీ పరీక్షకు 99.82% విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. మొత్తం 22,404 మంది విద్యార్థులకు 22,363 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. కోహిర్లో ఒకటి, జహీరాబాద్‌లో ఐదు, మొగుడంపల్లిలో ఒక పరీక్షా కేంద్రాన్ని తాను పరిశీలించినట్లు పేర్కొన్నారు.
SRPT: ప్రజా సమస్యల పరిష్కారం సీపీఎం పార్టీతోనే సాధ్యమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. శనివారం మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో రిటైర్డ్ ఎంఈఓ బంధు కృష్ణయ్యతో పాటు పలువురు సీపీఎం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు సీపీఎం ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు.
NLG: నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్‌లోని ఎస్ఎల్బీసీ బాలిక గురుకుల పాఠశాల సెంటర్లో తెలుగు పేపర్ లీక్ వ్యవహారంలో డ్యూటీలో ఉన్న అధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్ర సూపరింటెండెంట్‌ను డ్యూటీ నుంచి తొలగించి, ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసినట్లు MEO నాగయ్య తెలిపారు.
HNK: ఆరేపల్లిలో నిర్మాణంలో ఉన్న మెరిడియన్ స్కూల్‌కు అనుమతులపై అనుమానాలు తలెత్తుతున్నాయి. భవనం పూర్తి కాకముందే అనుమతులు ఎలా వచ్చాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యం వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభించి, అడ్మిషన్ ఆఫీసులు తెరిచింది. రెండు నెలల్లో నిర్మాణం ఎలా పూర్తవుతుంది, విద్యార్థుల భద్రత ఎవరి బాధ్యత అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
WGL: నేటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఘనంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో, క్రికెట్ బెట్టింగ్‌లను అరికట్టేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సీజన్లో బెట్టింగ్ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తూ, దీనిని నియంత్రించడానికి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
MDK: నర్సాపురం మండలంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా ముఖ్య సలహాదారుడు మిరియాల చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటలను గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
SRPT: సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి మహాదేవ నామేశ్వర స్వామి శివాలయంలో మూల నక్షత్రం మహా పర్వదినం సందర్భంగా శనివారం సరస్వతి అమ్మవారికి అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణ, శ్రీ చక్రదేవతకు మహిళా భక్తులు ఘనంగా పూజలు చేశారు. ఈ మేరకు ఆలయ అర్చకులు కుంకుమ పూజ, నీరాజన మంత్రపుష్పం నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ చేశారు.
ADB: భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో పంట చేలలోని బోరు బావుల వద్ద నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం తాంసి మండలంలోని గిరిగామ గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. NREGS ద్వారా నీటి ఎద్దడి నివారణకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మాలే బోరిగావ్ గ్రామపంచాయతీ కేబీ కాలనీలో రూ. 8లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు కాంగ్రెస్ కమిటీ ఎస్టీ సెల్ చైర్మన్ సేద్మాకి ఆనందరావు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేసే పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ కట్టబడి ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు.