SDPT: ఇంటి దగ్గర పార్ట్ టైం జాబ్ పేరుతో గృహిణి సైబర్ మోసానికి గురైన ఘటన దుబ్బాక పట్టణంలో చోటుచేసుకుంది. ఈ మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్ టైం జాబ్ పేరుతో వచ్చిన ఓ లింకును ఓపెన్ చేసింది. విడతల వారీగా ఆమె రూ. 59 వేలు వారి ఖాతాలకు పంపి మరికొంత డబ్బును పంపాలని సైబర్ నేరగాళ్లు కోరడంతో పోలీసులను ఆశ్రయించింది.
PDPL: శనివారం జరిగిన 10వ తరగతి హిందీ పరీక్షకు 99. 87 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి తెలిపారు. అదనపు కలెక్టర్ వేణు 1 పరీక్షా కేంద్రాన్ని, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 16 సెంటర్లను, అసిస్టెంట్ కమిషనర్ పరీక్షల విభాగం 3 సెంటర్లను సందర్శించారని తెలిపారు. హిందీ పరీక్షకు 7,383 మంది విద్యార్థులు 7,374 హాజరవ్వగా 9 మంది గైర్హాజరయ్యారు.
HYD: నాగమయ్యకుంటలో స్థానిక శాసనసభ్యుడు ముఠా గోపాల్‌తో కలిసి 44 లక్షలతో చేపట్టే మురికి నీటి పైపులైను పనులను శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభసభ్యులు డాక్టర్ కే.లక్ష్మణ్, ముఠాగోపాల్, వాటర్ వర్క్స్ అధికారులు, బీఆర్ఎస్ శ్రేణులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
SRD: జహీరాబాద్ పట్టణంలో ఆస్తి పన్ను చెల్లించని సరస్వతీ శిశు మందిర్ పాఠశాలను మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర రావు శనివారం సీజ్ చేశారు. పాఠశాల 27 లక్షల రూపాయల అస్తపన్ను చెల్లించాల్సి ఉందని కమిషనర్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అస్తి పన్ను వెంటనే చెల్లించాలని సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
SRD: ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు ఎత్తివేయాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మాణిక్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ధర్నాలు నిరసనలు చేయకుండా వైస్ ఛాన్సలర్ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పారు.
SDPT: గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పోస్టర్ ప్రదర్శన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి కమలా క్రిస్టియాన్ పాల్గొన్నారు.
NZB: జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నర్సింగ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కిరోసిన్ డబ్బాతో వచ్చిన నర్సింగ్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. కోర్టు సిబ్బంది అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. తన తండ్రి వ్యవసాయ శాఖలో పని చేస్తూ మృతి చెందాడని, కారుణ్య నియామకం కింద తనకు రావాల్సిన ఉద్యోగం ఇస్తానని మోసం చేశారన్నాడు.
నిజామాబాద్: ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీకాంత్ గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారు. డాక్టర్ శ్రీకాంత్ స్వస్థలం మోస్ర, మృతుడి భార్య నిర్మల్ జిల్లాలో ఆయుర్వేద వైద్యురాలుగా సేవలందిస్తున్నారు. మృతుడికి పలువురు వైద్యులు సానుభూతి తెలిపి నివాళులర్పించారు.
KMM: ప్రభుత్వం తక్షణమే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్కే.చాంద్ పాషా అన్నారు. శనివారం రేషన్ కార్డులను మంజూరు చేయాలని కోరుతూ జూలూరుపాడు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం చాంద్ పాషా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా నేటికీ కొత్త రేషన్ కార్డులను ఇవ్వలేదన్నారు.
SDPT: నియోజకవర్గ నిరుద్యోగ యువతుల కోసం ఈ నెల 23వ తేదీ ఆదివారం రోజున సిద్దిపేట విపంచి కళా నిలయంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలోని మహిళల కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ‘క్యూస్ విన్నింగ్ టుగేధర్’ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నారు.
మహబూబ్ నగర్: కోడేరు మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం. కోడేరు గ్రామానికి చెందిన బొమ్మగాల్ల మహేశ్ అనే యువకుడు రాత్రి 11 గంటల ప్రాంతంలో పోచమ్మ టెంపుల్‌కు దగ్గరలో ఉన్న బావి దగ్గర చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మేడ్చల్: ఈస్ట్ జోన్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ని వారి కార్యాలయంలో ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు నిధులు శాంక్షన్ చేయాల్సిందిగా అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని బాక్స్ డ్రైనేజీ పనులను కోరారు.
GDWL: అలంపూర్ నియోజకవర్గం శాంతినగర్ పట్టణంలో నేడు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి శ్రీశైలం పాదయాత్ర చేస్తున్న భక్తులకు ఆటో మెకానిక్ రాజ్ శేఖర్, హనుమంతు ఇద్దరు మిత్రులు వారికి పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారిని భక్తులు అభినందనలు తెలుపుతున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని దాతలు ముందుకు వస్తున్నారు.
ADB: గుడిహత్నూర్ మండలంలోని గోండ్ హర్కాపూర్ గ్రామంలో బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ నూతన సీసీ రోడ్డు పనులకు శనివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. కలిసికట్టుగా పనిచేసి గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలను కోరారు.