WGL: రాష్ట్ర ప్రభుత్వం పిఎఫ్ ఈఎస్ఐని కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు నేడు ప్రైవేటు స్వచ్ఛ ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకొని మా డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. డ్రైవర్లకు ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు.
KMM: సత్తుపల్లి పట్టణంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్లెఓవర్ బ్రిడ్జ్‌పై వెళుతున్న కారు అదుపు తప్పి లైటింగ్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి సత్తుపల్లి మీదుగా వరంగల్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు క్లియర్ చేశారు.
SRCL: తంగళ్ళపల్లిలోని విగ్రహాల మూలమలుపు వద్ద పోలీసులు సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రామ్మోహన్ మాట్లాడుతూ.. వాహనదారులందరూ సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన, ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
NRML: ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో శ్రీ శివ మార్కండేయ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సర్వేష్, ఉపాధ్యక్షులుగా గట్టుపల్లి కమలాకర్, జాయింట్ క్యాషియర్‌గా గట్టుపల్లి రమేష్, గోనే సాయినాథ్, సభ్యులుగా గోనె లక్ష్మణ్, గట్టుపల్లి పోశెట్టి, గట్టుపల్లి విట్టల్, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
HYD: ముషీరాబాద్ ఎక్స్రేడ్లో అర్ధరాత్రి లారీ బీభత్సం సృష్టించింది. పోలీసుల వివరాల ప్రకారం.. ముషీరాబాద్ జంక్షన్ వద్ద పార్క్ చేసిన వాహనాల పైకి లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో అబ్దుల్లా అనే వ్యక్తి మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ హాస్పిటల్ తరలించారు. ముషీరాబాద్ పోలీస్ వాహనంతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
BDK: రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన పెసర ప్రభాకర్ రెడ్డిని 10వ తరగతి మిత్రబృందం సోమవారం సన్మానించారు. గుర్రం వెంకటరెడ్డి, రచ్చ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిపిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బయ్యారం ఎంఈఓ దేవేంద్ర చారి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభాకర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు.
KMM: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌పై పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. సోమవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మంలో అమిత్ షా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ASF: కాగజ్‌నగర్ మండలం ఇస్లాం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శివ మల్లన్న స్వామి ఆలయంలో సోమవారం మార్గశిర బహుళ అమావాస్య, సోమవతి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకం అనంతరం భస్మహారతి, ప్రత్యేక అలంకరణ, అర్చన, పంచహారతులు ఇచ్చారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
HYD: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా.. అతివేగంతో వాహనాలు దూసుకెళ్లే ప్రమాదం పొంచి ఉండటంతో నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో డిసెంబర్ 31న రాత్రి 10 గంటల తర్వాత ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలకు ఫ్లై ఓవర్ల మీదకు అనుమతి ఉండదు.
MDK: కౌడిపల్లి మండలం తునికి నల్ల పోచమ్మ దేవాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం పురస్కరించుకొని అమ్మవారికి ఉదయం పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. రంగురంగుల పూలమాలలు, పట్టు వస్త్రాలతో అమ్మవారిని అందంగా అలంకరించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.
NLG: శాలిగౌరారం 102 జీవోకు విధానాలు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో రజకులకు మేలు జరుగుతుందని తెలంగాణ రజక ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో దోబి సంబంధించిన కాంట్రాక్ట్లన్ని రాష్ట్రానికి సంబంధించిన రజకులకు మాత్రమే కేటాయించాలని 102 జీవో ఉద్దేశ్యం అన్నారు.
MDK: జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 31న విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు ఉంటాయని ఎస్పీ ఉదయ్ కుమార్ తెలిపారు. సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందామన్నారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డీజేలు, అధిక శబ్దం వచ్చే బాక్స్‌లు వినియోగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు పై వారిపై కేసు నమోదు చేశారు.
NZB: నందిపేట్ మండలం బజార్ కొత్తూరు గ్రామంలో CMRF చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన పల్లికొండ సుమలతకు రూ.16 వేల చెక్కును కాంగ్రెస్ నాయకులు అందజేశారు. లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల లక్ష్మి నారాయణ, గోపు ముత్యం, నర్సయ్య, రాజు, గజేందర్ తదితరులు పాల్గొన్నారు.
SRPT: రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో జాతర దురాజ్‌పల్లి (పెద్దగట్టు) జాతర. ఈ జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు 5 రోజుల పాటు వైభవంగా జరగనుంది. మొదటి రోజు దేవరపెట్టే తరలింపు, 2వ రోజు కంకణ అలంకరణలు, 3వ రోజు స్వామివారి చంద్రపట్నం, 4వ రోజు దేవరపెట్టే కేసారం తరలింపు, 5వ రోజు మకరతోరణం తొలగింపుతో జాతర ముగుస్తుంది.
మెదక్: చిన్న శంకరంపేటలో గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈనెల 28న బీహార్‌కు చెందిన రాజేశ్ వద్ద 190 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ నెలలో చిన్న శంకరంపేట పరిశ్రమ వద్ద బీహార్‌కు చెందిన సూరజ్ అనే వ్యక్తి నుంచి ఇద్దరు వ్యక్తులు గంజాయి కొనుగోలు చేయగా జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులకు పట్టుబడ్డారు.