SRPT: ఐపీఎల్ క్రికెట్ సీజన్ సందర్భంగా యువత ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడవద్దని క్రమశిక్షణతో మంచిగా చదివి ఉన్నత స్థాయిలకు ఎదగాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ అన్నారు. మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని తెలిపారు.