SRPT: క్షయ వ్యాధి నివారణ అందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ తేజస్ పేర్కొన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో 491 వ్యాధిగ్రస్తులు ఉన్నారని వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. క్షయ వ్యాధి అంతానికి అందరితో కలిసి పనిచేస్తానని ప్రతిజ్ఞ చేయించారు.