SRPT: వెంకేపల్లి నుంచి కోడూరుకు పాలేరు మీదుగా బ్రిడ్జి నిర్మించి రోడ్డు ఏర్పాటు చేయాలని నూతనకల్ మండలం వెంకేపల్లి శివారులోని వాగును, రోడ్డును పరిశీలించిన అనంతరం అధికారుల సమావేశంలో ప్రతిపాదించారు. ఈ ప్రాంత రైతులు తమ వ్యవసాయ పనుల నిమిత్తం వాగు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో వాగు దాటుతుండగా ఒక వ్యక్తి కొట్టుకుపోయిన ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.