MNCL: రామగుండం CP అంబర్ కిషోర్ ఝా సోమవారం కన్నెపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించారు. స్టేషన్ పరిసరాలు పరిశీలించి, సిబ్బందితో సీపీ మాట్లాడారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మావోయిస్టుల వివరాలు పరిశీలించి వారి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవనం పరిశీలించి, త్వరగా పనులు పూర్తిచేయాలన్నారు.