PDPL: ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ పాఠశాలలో మేడారం PHC వైద్యాధికారి డాక్టర్ సుస్మిత ఆధ్వర్యంలో విద్యార్థులకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. వ్యాధి లక్షణాలు, వ్యాధి సోకే విధానం, చికిత్స మార్గాల గురించి వివరించారు. కటికనపల్లిలో MLHP డాక్టర్ గౌతమ్, కిలా వనపర్తిలో డాక్టర్ రాజు, ఇతర సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలు వ్యాధిపై అవగాహన కల్పించారు.