BHPL: కాటారం మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో పలువురు నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యమ నాయకులు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు ఇచ్చిన 250 గజాల ఇంటి స్థలం, రూ.25,000 నగదు సహాయాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నేతలు పాల్గొన్నారు.