HYD: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిపై మధురానగర్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. యాదగిరినగర్‌లో నివాసముంటున్న షేక్ ఫైజల్ మత్తు పదార్ధాలను విక్రయిస్తున్నాడని సమాచారంతో పోలీసులు అతని ఇంటిపై దాడిచేసి 155 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నుంచి కొనుగోలు చేసిన మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
JGL: పట్టణంలోని సూర్య గ్లోబల్ ప్రైవేట్ హై స్కూల్లో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ సోమవారం తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లోని ఆయా రూములను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు.
NGKL: జిల్లాలోని అమ్రాబాద్‌లో SLBC సొరంగం కూలి 8 మంది గల్లంతైన విషయం తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న ఒకరి మృతదేహం లభించగా మరో ఏడుగురు కార్మికుల ఆచూకీ నేటికీ లభించలేదు. ఈ ఘటన జరిగి నేటికి 31 రోజులు గడిచినా సొరంగంలో చిక్కుకున్న ఏడుగురి మృతదేహాలు లభించేనా అని అనుమానం వ్యక్తమవుతోంది. ఆ ఏడుగురి ఆచూకీ మాత్రం దొరకడం లేదు.
KMM: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. BRSలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ సైతం కాంగ్రెస్‌లో చేరడంతో BRS ఖాళీ అయ్యింది. దీంతో ఎన్నికల తరువాత BRS నేతలు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడిప్పుడే పార్టీ అధినేత ఆదేశాల మేరకు కాంగ్రెస్ వైఫల్యాలను గట్టిగానే ప్రజల్లోకి తీసుకెళుతుంది.
GDWL: గద్వాల ఆర్టీసీ డిపో నూతన మేనేజర్‌గా సునీత నియమితులయ్యారు. జగిత్యాల డిపో మేనేజర్‌గా పనిచేసిన సునీతను గద్వాలకు బదిలీ చేస్తూ సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ADB: జిల్లా కేంద్రంలోని TTDCలో విపత్తు నిర్వహణపై సోమవారం నుంచి ఈనెల 29వరకు మర్రిచెన్నారెడ్డి ఇన్’స్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 18నుంచి 40సంవత్సరాల వయస్సు కలిగి, పదవ తరగతి పాసైన 50మందికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. భోజనం ఖర్చులకు వంద రూపాయలతోపాటు రాత్రి వసతి ఉంటుందన్నారు.
KMR: జిల్లా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని నేడు కామారెడ్డి శుభం గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు మదన్మోహన్ రావు, లక్ష్మీకాంతరావు తుదితులు హాజరుకానున్నారు.
SRD: సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద ఏడు అంబులెన్స్‌లను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పార్లమెంట్ పరిధిలోని ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో అంబులెన్స్‌ను కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేశ్వరరావు దేశ్పండే, జగన్, పవన్ కుమార్, ద్వారకా రవి పాల్గొన్నారు.
SRD: సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈనెల 24 నుంచి ఇంటర్మీడియట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం ఆదివారం తెలిపారు. కెమిస్ట్రీ, ఎకనామిక్స్ జవాబు పత్రాల వాల్యుయేషన్ జరుగుతుందని చెప్పారు. వాల్యుయేషన్‌లో పాల్గొనే లెక్చరర్ లను ఉదయం 10 గంటలకు రిలీవ్ చేయాలని ప్రిన్సిపల్లు సూచించారు.
SRD: మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగాని ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు గీత అన్నారు. కంది మండలం చర్యాల గ్రామంలో ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేద్కర్ దళితులకు రిజర్వేషన్ అందిస్తే మందకృష్ణ అన్ని వర్గాల వారికి రిజర్వేషన్లు అందిస్తున్నారు.
HNK: హసన్‌పర్తి మండలంలోని దేవన్నపేట గ్రామంలో గల దేవాదుల పంప్ హౌస్‌ను ఆదివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు సందర్శించి మోటార్లను పరిశీలించారు. బీఆర్ఎస్ పాలనలోనే దేవాదుల నుంచి రైతులకు నీరు అందిందని.. ఈ కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.
JN: జనగామ మండలం గానుగపహాడ్ గ్రామానికి చెందిన దడిగే సందీప్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఫలితాలలో ఉత్తీర్ణత సాధించి న్యాయవాది అయ్యారు. ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షునిగా విద్యారంగ సమస్యల మీద పోరాడుతూ.. విద్యను పట్టు విడవకుండా ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్.ఎల్.ఎమ్ విద్యను పూర్తి చేసారు. కాగా వారిని పలువురు అభినందించారు.
MNCL: దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాధ్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామ శివారులో పాడైన మొక్కజొన్న పంటను ఆయన పరిశీలించారు. బాధిత రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరారు.
SDPT: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మల్లన్న ఆలయంలో బోనం సమర్పించి, గంగిరేగు చెట్టు వద్ద పట్నం వేసి, గర్భలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి స్వామి వారి శేషవస్త్రాలు, తీర్ధ ప్రసాదలు అందజేశారు.
SDPT: రంగధాంపల్లి నుంచి పొన్నాల వెళ్లే మార్గంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జె. మర్ఫీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టి గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తుల నుంచి 786 గ్రాముల గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరచుకుని సీజ్ చేశారు.