BHPL: భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దివస్ కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొన్నారు. ఈ సందర్భంగా 21 మంది ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారులు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి సమస్యపై విచారణ చేసి ప్రజలకు తగిన న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.