ASF: జిల్లా కాగజ్‌నగర్ అరుణోదయ స్కూల్ విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్‌లు వంటి అంశాలపై ఎఎస్ఐ సునీత వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో షీ టీం హెల్ప్ లైన్ 87126 70565 లేదా డయల్ 100 ద్వారా సహాయం కోరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లలిత, టీచర్లు, షీ టీం పాల్గొన్నారు.