BHNG: తాజ్ పూర్ గ్రామానికి చెందిన పేద ముస్లిం ఒంటరి మహిళ అయిన షేక్ అమీనాబి ఆవాసం లేక చాలా ఇబ్బంది పెడుతుంది. ఆమె పరిస్థితి చూసి ఆమెకోసం గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, ఆర్ఎస్‌కే ఫౌండేషన్ ద్వారా స్వంత ఖర్చుతో సామాజిక వేత్త డా. ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటిని నిర్మించి ఇచ్చి చేయూతనిచ్చారు. రంజాన్ పర్వదినం సందర్భంగా గృహప్రవేశం చేశారు.
JGL: గొల్లపల్లి మండల ఎస్సీ,ఎస్టీ, బీసీ జేఏసీ కమిటీలను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు మనాల కిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడిగా తాడురీ శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షుడిగా ఏనుగందుల తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా బాలే అశోక్ ఎన్నికయ్యారు. బహుజనుల హక్కుల సాధన కోసం ఈ కమిటీలు కృషి చేస్తాయని నాయకులు పేర్కొన్నారు.
JN: నర్మెట్ట మండలంలోని ఆగాపేట గ్రామంలో ఈనెల 23వ తేదీన మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. వైద్య శిబిరానికి హాజరుకావాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి గ్రామ సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ అనిల్ కుమార్ ఆహ్వానం అందజేశారు. ఉచిత వైద్య శిబిరానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
HNK: శాయంపేట మండల కేంద్రంలో ఈ నెల 23వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు BRS నేతలు తెలిపారు. 23వ తేదీన ఉదయం 9 గంటలకు SVKK ఫంక్షన్ హాలులో రక్తదాన శిబిరం నిర్వహించబడుతుందని, మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని నేతలు కోరారు.
MDK: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా ఉందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు ఆరోపించారు. రామాయంపేట బీజేపీ కార్యాలయంలో ఇవాళ బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. విద్యారంగానికి కేవలం ఎనిమిది శాతం నిధులు కేటాయించడంపై మండిపడ్డారు. ఆరు గ్యారెంటీ పథకాలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
WGL: చెన్నారావుపేట (M)లోని పలు గ్రామాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట కోత దశకు చేరుకునే సమయంలో నీటి కొరత కారణంగా మొక్కలు ఎండిపోతున్నాయని రైతులు శనివారం తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి SRSP కాలువ నీటిని వెంటనే విడుదల చేయాలని కోరారు.
ADB: రంజాన్ పండుగను పురస్కరించుకుని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శనివారం ఉట్నూర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ప్రపంచ శాంతికి ప్రతిరూపమని ఆయన కొనియాడారు. అందరూ శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఇంటి నల్లాలకు బిరడాలు సరిగా పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు. నల్లాల సంపులను శుభ్రంగా లేకపోతే నాచు, మట్టి పేరుకుపోయి మురికి నీరు, దుర్వాసన వచ్చే ప్రమాదం ఉందన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలన్నారు.
MDK: హత్నూర మండలం గుండ్ల మాచునూర్ గ్రామానికి చెందిన అక్షిత్‌కు వైద్య సహాయం అందింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి రూ.2.5 లక్షల ఎల్‌వోసీ అందజేశారు. ప్రస్తుతం అక్షిత్ హైదరాబాద్‌లోని నిమ్స్ హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి సహాయ కార్యక్రమాలు బాధిత కుటుంబాలకు ఎంతో ఊరటాన్ని ఇస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
MBNR: అనారోగ్యంతో పది రోజుల క్రితం ఇంటికి వచ్చిన డిగ్రీ విద్యార్థిని నవాబ్‌పేట మండలంలో అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. షాద్‌నగర్‌లో చదువుతున్న ఆమె గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై విక్రం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టుతున్నారు.
SDPT: హుస్నాబాద్ యాసంగి సీజన్‌లో సాగు చేసిన పొద్దు తిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ కంది తిరుపతిరెడ్డి తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటల్ కు రూ. 7,721వేలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ పండుగను పురస్కరించుకొని గద్వాలలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు సహా పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు కలెక్టర్ రుద్రం భాషను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోదరా భావంతో పండుగ జరుపుకోవాలని కలెక్టర్ తెలిపారు.
NZB: విద్యా రంగంపై CM రేవంత్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని AIFDS జాతీయ కన్వీనర్ రాజశేఖర్ శనివారం ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామన్నారు. కానీ నిన్నటి బడ్జెట్‌లో 8.22% మాత్రమే కేటాయించడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన మహిళా సిబ్బందికి ఆలయ ఛైర్మన్ ఇంగిలె రామారావు చీరలను పంపిణీ చేశారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు మహిళా ఉద్యోగులకు ఆయన తన సొంత ఖర్చుతో కొనుగోలు చేసిన చీరలను కానుకగా అందజేశారు. ఆలయ సేవలో తరిస్తున్న సిబ్బందికి చిన్నపాటి సాయం అందించానన్నారు.
WGL: 34వ డివిజన్లో రంజాన్ పర్వదినం సందర్భంగా మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావు ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చింపివేశారు. ఈ ఘటన పై మాజీ కార్పొరేటర్ ఉషశ్రీ- శ్రీనివాస్, 34వ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ చేపట్టాలని CI రమేష్ కు ఆదేశాలు జారీ చేశారు.