SRD: అంగన్వాడీలలో చిన్నారులకు నూతన బోధనా పద్ధతులు అమలు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో పూర్వ ప్రాథమిక విద్య సదస్సు శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులకు బొమ్మలతో అర్థమయ్యేలా బోధించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.