SDPT: జగదేవ్‌పూర్ మండల కేంద్రంలో పశువుల సంత, తై బజార్ బహిరంగ వేలం పాట స్పెషల్ ఆఫీసర్ డీఎల్పీఓ లత ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ వేలం పాటలో పశువుల సంతను గజ్వేల్‌కి చెందిన రాజేశం రూ.52లక్షలకు దక్కించుకున్నారు. అలాగే తై బజార్‌ను జగదేవ్‌పూర్‌కు చెందిన కనకయ్య రూ.8లక్షల70 వేలకు దక్కించుకున్నారు.