NLG: ధాన్యం సేకరణ కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ జై.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. PACS CEOలు, చైర్మన్లకు రబీ ధాన్యం సేకరణ, మద్దతుధరపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రణాళిక ప్రకారం రబీ ధాన్యం సేకరించాలని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు 48గంటల్లో డబ్బులు జమ చేయాలని సూచించారు.