MNCL: జిల్లాలోని జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పరిధిలో అదనంగా మంజూరైన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ సంబంధిత శిలాఫలకం, హెలీప్యాడ్, బహిరంగ సభ ఏర్పాటు చేసే స్థలం, సమావేశ మందిరంలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పరిశీలించారు. ప్లాంట్ పనులను రాష్ట్ర ప్రముఖులచే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.