SDPT: జిల్లాలోని మహిళా రైతులందరికీ 50% రాయతీపై వ్యవసాయ పనిముట్లు ఇవ్వనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా స్మామ్(SMAM) పథకం ద్వారా 50% రాయతీపై మహిళా రైతులకు మాత్రమే అందుబాటులో ఉండే వ్యవసాయ పనిముట్లు అందించబడుతున్నాయని పేర్కొన్నారు.