SRPT: తిరుమలగిరి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడిన జూనియర్ కళాశాలకు శాశ్వత భవన నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాల కొరకు, అదేవిధంగా నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే సామేలు కోరారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.