NZB: బోధన్ పట్టణంలోని కమ్మ సంఘంలో బుల్లెట్ రెడ్డి సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోగా ఆది నారాయణ, హీరోయిన్‌గా మేఘ నటిస్తున్నారు. ఫైట్ మాస్టర్ ఖయ్యుమ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన విలన్లు ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు.
NLG: బీబీనగర్ మండల కేంద్రంతో పాటు చిన్న రావులపల్లి కొండమడుగు గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీబీనగర్ మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
KNR: జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్‌లో లక్ష డప్పుళ్లు, వేయి గొంతుల మహాప్రదర్శన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కో-ఆర్డినేటర్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కమిటీ ఎన్నిక, ఉమ్మడి జిల్లా కళాకారుల కవాతు గురించి వివరించారు.
NGKL: అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ మంద జగన్నాథ్‌ను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆదివారం సాయంత్రం పరామర్శించారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి మంద జగన్నాథ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
నల్గొండ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కొప్పుల సుధాకర్ రెడ్డి 100వ సారి రక్తదానం చేయగా అతణ్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, సెక్రటరీ చల్లా వెంకటరమణ, ఛైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
WGL: రేపు (సోమవారం) ఏటూరునాగారంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి పర్యటించనున్నారు. ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీఆర్టీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలుపనున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సునీల్ కుమార్ ప్రకటనలో తెలిపారు. కాగా ఉదయం 11 గంటలకు సమ్మె శిబిరానికి చేరుకుంటారన్నారు.
HYD: MGBS బస్టాండుకు వచ్చే ఓ ప్రైవేట్ బస్సులో గంజాయి చాక్లెట్స్‌ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి HYDకు తరలిస్తున్న వెయ్యి చాక్లెట్స్‌ను సీజ్ చేశారు. ఒక్కో చాక్లెట్‌ని రూ.30కి విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. నిందితుడు అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
వరంగల్: వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన కంపెల్లి సంజన(13)బాలిక మతిస్థిమితం లేక ఈనెల7వ తేదీన పురుగు మందు తాగింది. వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యంకోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం బాలిక మృతి చెందింది.పోలీసులు కేసు నమోదు చేశారు.
JN: జాతీయ స్థాయి టెన్నిస్, వాలీబాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు జనగామ ఏసీపీ పార్థసారథి ఆదివారం ధర్మకంచ మినీ స్టేడియంలో క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ నెల 31, జనవరి 1, 2 తేదీల్లో ఉత్తరప్రదేశ్ వారణాసిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని పీఈటీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్ తెలిపారు.
BDK: పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మతల్లి అమ్మవారిని ఆదివారం సింగరేణి సేఫ్టీ కార్పొరేట్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ దంపతులు, సింగరేణి ఎస్టేట్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం అందించారు.
PDPL: పెద్దపల్లి బస్సు డిపో ఏర్పాటుకు భూమి అప్పగింతపై అధికారులతో, కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి 10లోపు పెద్దపల్లి ఎంపీడీవో ప్రాంగణంలోని కార్యాలయాల తరలింపు పూర్తి కావాలన్నారు. పెద్దపల్లిలో బస్సు డిపో మంజూరైన నేపథ్యంలో స్థలం అప్పగించేందుకు వీలుగా పెద్దపల్లి ఎంపీడీవో ప్రాంగణంలో ఉన్న కార్యాలయాల తరలింపు వేగవంతం చేయాలన్నారు.
SRD: కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టర్ క్రాంతి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. కోర్టులో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల స్థితిగతులు తెలుసుకోవాలని సంక్షేమ హాస్టల్లో నూతనమైన అమలు జరిగెల చర్యలు చేపట్టాలని హాస్టల్లో వార్డెన్‌లో కొరతా లేకుండా చూడాలన్నారు.
మెదక్: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చిరాగ్‌పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రాజేందర్ రెడ్డి వివరాలు.. బుచినేల్లీ గ్రామా శివారులో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయస్సు 35 ఉంటుందని, వివరాలు తెలిసిన వారు 8712656766 సమాచారం ఇవ్వాలన్నారు.
SRD: సంగారెడ్డి పట్టణంలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఉన్న ఆయుధాగారాన్ని మల్టీ జోన్ డీఐజీ సత్యనారాయణ తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయుధాల పనితీరును పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రూపేష్ పాల్గొన్నారు.
మేడ్చల్: ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 2024 మొత్తంలో సైబరాబాద్ పరిధిలో మొత్తం 1,507 మంది చిన్నారులను రక్షించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సీపీ అవినాష్ మహంతి డీటెయిల్ నోట్ విడుదల చేశారు. 18 ఏళ్ల వయసులోపు వారిని పనులలో నియమించినా, పనిచేయాలని బలవంతం చేసినా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.