WNP: జిల్లాలో వివిధ చోరీలకు పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసి 5 చోరీ కేసులు చేదించారు. చోరీలకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు బంగారం 14 gr. వెండి 650gr, గుడిలో సామాను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు.
MDK: శివంపేట మండలం దొంతి గ్రామంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో ఆదివారం బీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రైతు విభాగం, BC, SC, ST, మైనార్టీ సెల్, మహిళా విభాగాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలన్నారు.
JGL: మెట్పల్లి పట్టణంలోని బైపాస్ రోడ్డులో, ఆదర్శనగర్ కృష్ణవేణి స్కూల్ ముందు ఉన్న ప్రధాన మురుగు కాల్వ చెత్తా చెదారంతో నిండిపోయిందని స్థానికులు వాపోయారు. మురుగు కాల్వలో చెత్తాచెదారం నిండిపోవడంతో మురుగు నీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుందని అన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో తమ సేవలను గుర్తించి క్రమబద్ధీకరించాలని కోరుతూ కాంట్రాక్టర్ రెసిడెన్షియల్ టీచర్లకు ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ ఆదివారం సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను క్రమబద్ధీకరించే వరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
NZB: పోలీస్ కమిషరేట్ పరిధిలో ఈ ఏడాది క్రైం రేటు పెరిగింది. నేరాలకు సంబంధించిన వార్షిక నివేదికను ఆదివారం ఇన్‌ఛార్జి CP సింధుశర్మ విడుదల చేశారు. గతేడాది 8635 కేసులు నమోదవగా, ఈ సంవత్సరంలో 8,745 నమోదయ్యాయి. గతేడాదిలో పోలీస్ క్రైం రేటు 1.27% పెరిగింది. ఇందులో 42 హత్య కేసులు, 47 హత్యాయత్నం, 57 కిడ్నాప్ కేసులు, 77 అత్యాచారం కేసులు నమోదయ్యాయి.
KMM: మధిర మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామ సాంఘిక సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న ప్రముఖ కవి, రచయిత, ఉపాధ్యాయుడు రావిరాల బుచ్చయ్యకు ఆదివారం ఖమ్మం పట్టణంలో పుడమీ సాహితీ వేదిక తెలంగాణ 6వ వార్షికోత్సవ సందర్భంగా పుడమి సాహితీ వేదిక, మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో పుడమి రత్న జాతీయ విశిష్ట పురస్కారాన్ని అందించటం జరిగింది.
NZB: నిజామాబాద్ జిల్లా బాలికల జట్టు 2024 సీఎం కప్ వాలీబాల్ ఛాంపియన్షిప్‌ను కైవసం చేసుకుంది. CM కప్ పోటీల్లో భాగంగా వాలీబాల్ టోర్నమెంట్ ఖమ్మం జిల్లాలో జరిగింది. వరుస విజయాలతో దూసుకెళ్లిన NZB జిల్లా జట్టు ఫైనల్ మ్యాచులో మహబూబ్ నగర్ జట్టుతో తలపడింది. బెస్ట్ ఆఫ్ ఫైవ్ పద్ధతిలో జరిగిన తుది పోరులో NZB జిల్లా జట్టు 3 సెట్లు గెలిచి 3-1 తేడాతో ఘన విజయం సాధించింది.
ADB: ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తల్లి దేవుబాయి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎంపీ నగేశ్ వారి కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎంపీ వెంట మాజీ జడ్పీటీసీ తాటిపెళ్లి గంగాధర్, వెంకట స్వామి, రాజన్న, బీజేపీ నాయకులు తదితరులున్నారు.
KMM: మధిర మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామానికి చెందిన డీసీసీబీ ఛైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ఆదివారం కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ డైరెక్టర్లతో కలిపి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో ప్రత్యేక సమావేశంలో పాల్గొని పలు ముఖ్య అంశాలను గురించి చర్చించారు. అనంతరం కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు.
NGKL: గుండెపోటుతో ఓ లెక్చరర్ మృతిచెందిన ఘటన నాగర్ కర్నూల్‌లో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న గురుకుల కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న మహమ్మద్ అలీ వాకింగ్ చేస్తూ కింద పడిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
HYD: నిత్యం లక్షలాదిమంది రైల్వే ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్నిచోట్ల పారిశుద్ధ్యం కరవవుతోంది. స్థానిక ఆల్ఫా హోటల్ ఎదుట రోడ్డు మొత్తం బురద, కంపుతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. కనీసం నడవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రయాణికులు ఉన్నారు.
NZB: తాడ్వాయి మండలం అబ్దుల్లానగర్‌లో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు డా. పైడి ఎల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో ఆర్యవైశ్యులది ప్రధాన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి రూ. 20లక్షల విలువ చేసే భూమిని దానం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
MHBD: జిల్లా కేంద్రంలో ప్రముఖ సీపీఐ నాయకులు కామ్రేడ్ దర్మన్న 24వ వర్ధంతిసభను నేడు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ధర్మన్న స్థూపానికి కార్యకర్తలు భారీగా హాజరై పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సీపీఐ జిల్లాకార్యదర్శి విజయసారధి ముఖ్యఅతిథిగా హాజరై ధర్మాన పోరాట స్ఫూర్తిని కార్యకర్తలకు వివరించారు.
KMM: మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆదివారం వారి కార్యాలయంలో రైతు భరోసా విధి విధానాలపై గంటన్నరపాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ASF: నూతన సంవత్సర వేడుకల్లో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మందు సేవించి వాహనాలు నడపడం, రోడ్లపై ఇబ్బందులు కలిగించడం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత పోలీసులకు సహకరించాలని సూచించారు.