SRD: ఝరాసంఘం మండలంలో సోమవారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు పర్యటించనున్నట్లు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేశం తెలిపారు. ఝరాసంఘం మండల కేంద్రంలో నిర్మిస్తున్న షాదీఖానా నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఉదయం 10 గంటలకు విచ్చేస్తున్నట్లు వివరించారు. ముస్లిం మైనార్టీ నాయకులు, పార్టీ నాయకులు హాజరుకావాలని వెంకటేశం కోరారు.
NLG: అర్బన్ కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ సముదాయంలో చిన్న చిన్న మరమ్మతులన్నింటిని జనవరి15 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఆదివారం ఆమె సంబంధిత అధికారులతో కలిసి కలెక్టరేట్ వెనకవైపు నిర్మిస్తున్న NLG అర్బన్ కాలనీలోని ఇండ్లను తనిఖీ చేశారు.
KMM: రేపు(సోమవారం) కల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో జరిగే ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని తహసీల్దార్ సాంబశివుడు తెలిపారు. ప్రజలు వారి సమస్యలకు సంబంధించిన అంశాలను లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని చెప్పారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని తెలిపారు.
MBNR: నేటి ఆధునిక సమాజంలో ఆత్మ రక్షణ కోసం బాల బాలికలకు కరాటే అవసరమని మున్సిపల్ ఛైర్మన్ దేవేందర్ యాదవ్ ఆదివారం అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో కరాటి మాస్టర్ నరసింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవేందర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెమోలు, బెల్టులు అందజేశారు.
మేడ్చల్: ఓ మహిళ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఉప్పల్ పరిధి చిలుకా నగర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ముద్దంగుల మహేశ్వరి(29)కి నరేశ్(40)తో వివాహం జరిగింది. వారికి 9 ఏళ్ల బాలుడు ఉన్నాడు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. రాత్రి సమయంలో మహేశ్వరి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
PDPL: జనవరి 1వ తేదీన పెద్దపల్లి కూరగాయల మార్కెట్‌లో అమ్మకాలు యథావిధిగా కొనసాగుతాయని రిటైల్ వ్యాపార అసోసియేషన్ సభ్యులు తీర్మానం చేశారు. కొన్నేళ్లుగా ప్రతినెలా 1వ తేదీన మార్కెట్ బంద్ చేస్తున్నామని, నూతన సంవత్సరం కావడంతో జనవరి 1న మార్కెట్‌లో అమ్మకాలు యథావిధిగా ఉంటాయని తెలిపారు. ప్రజలు గమనించాలన్నారు.
NRML: నర్సాపూర్(జీ) మండలంలో డిసెంబర్ 31 వేడుకలు నిషేధమని ఎస్ఐ సాయికిరణ్ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదన్నారు. మైనర్లతోపాటు ట్రిపుల్ రైడింగ్ చేయరాదని హెచ్చరించారు. నిర్మల్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున గుమిగూడుతూ తిరగరాదన్నారు. డీజేలు నిషేధమని, ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.
MHBD: కొత్తగూడ మండల పరిధిలో పెద్దపులి తిరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కుశ కుమార్ హెచ్చరించారు. నేడు కొత్తగూడ పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయదారులు ఒంటరిగా చేనులలో పనులకు వెళ్ళవద్దని, పరిసర ప్రాంతాలను జాగ్రత్తగా గమనించాలని ప్రజలకు సూచనలు చేశారు.
JGL: జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో ఐదేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. పట్టణానికి చెందిన తల్లి తన కూతురితో అప్పుడే బస్సు దిగి ఆటో కోసం ఎదురు చూస్తుండగా కిడ్నాపర్ బాలికను ఎత్తుకుని పరార్ అవుతుండగా బాలిక తల్లి అరిచింది. స్థానికులు కిడ్నాపర్‌ను అడ్డుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.
RR: ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. ఆదివారం శంషాబాద్ అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన మహా పడిపూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని పూజలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
NLG: నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునే వారు జాగ్రత్తలు పాటించాలి, ప్రమాదాలకు దూరంగా ఉంటూ పిల్లలు పెద్దలు అందరూ వారి ఇండ్లలో ఉత్సవాలు జరుపుకోవాలి, పోలీసు వారి సూచనలు పాటించాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ జిల్లా ప్రజలకు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.
మేడ్చల్: మల్కాజ్‌గిరి వినాయకనగర్‌లోని కాశీ విశ్వనాథ్ దేవాలయాన్ని MLA మర్రి రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా ముఖ ద్వార నిర్మాణం కోసం దేవాలయ కమిటీ సభ్యులకు రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అన్నారు.
BDK: కొత్తగూడెం మున్సిపాలిటీ 10వ వార్డు నెహ్రూ బస్తీలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఆదివారం కౌన్సిలర్ మునిగడప పద్మ పరిశీలించారు. ఇంటిదగ్గర అందుబాటులో లేని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు ఒకటికి రెండు సార్లు వెళ్లాలని సర్వే అధికారులకు సూచించారు. సర్వేలో వాస్తవాలను మాత్రమే నమోదు చేయించుకోవాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలిపారు.
MDK: పట్టణం 12వ వార్డు పెళ్ళికొటాల్‌కు చెందిన నాచారం శ్వేత, మల్లుపల్లి రివ్వీ (మహేష్) అనే ఇద్దరు గత మూడు సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకొని కలిసిమెలిసి ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు పెళ్లి చేసుకుందాం, అని గత 15, 20 రోజుల కిందట అడగగా నేను చేసుకోను అని గట్టిగా ముఖం మీద చెప్పేసరికి ఆదివారం ప్రియుడు ఇంటి ముందు నాకు న్యాయం చేయండి అని వేడుకుంటుంది.
SRD: నారాయణఖేడ్ మండలం జుక్కల్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి తెలుసుకొని ఆదివారం వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.