SRD: ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాల అమలు కార్యక్రమాన్ని ఖేడ్ నియోజకవర్గం శంకరంపేట మండలం దానంపల్లి గ్రామంలో ఖేడ్ MLA సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు లబ్ధిదారులకు మంజూరి పత్రాలను ఆయన అందజేశారు. ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు.
SRD: బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమే లేదన్నారు. పొరపాటున బీజేపీకి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉనికి కోసమే బండి సంజయ్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. ఇందిరమ్మ పేరు పెడితే నిధులు ఇవ్వమని సంజయ్ బెదిరిస్తున్నారన్నారు.
KMM: ఎదులాపురం గ్రామపంచాయతీ వరంగల్ X రోడ్‌లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KMM: తిరుమలాయపాలెం మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఏలువారిగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ 4 సంక్షేమ పథకాలను ఆదివారం ఆత్మ కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణ ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి పత్రాలను అందజేశారు. చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న 4 సంక్షేమ పథకాలను ప్రారంభించిందని పేర్కొన్నారు.
KMM: మధిర మండలం కృష్ణాపురం గురుకుల కళాశాలలో వారం రోజుల క్రిందట చల్లా మహేష్ అనే విద్యార్థి తప్పిపోయిన విషయం తెలిసిందే. కాగా విద్యార్థి యొక్క ఆచూకీ వైజాగ్ ఆర్కే బీచ్‌లో లభ్యమైనట్లు తెలుస్తుంది. బీచ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న విద్యార్థి మహేష్‌ను ఓ ఆటో డ్రైవర్ గమనించి ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ తీసుకొని సమాచారం అందించాడు.
KMM: జిల్లాలో 1,31,723 మంది రైతులకు రూ. 908 కోట్ల 76 లక్షల మేర 2 లక్షల రుణ మాఫీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. అటు 42,461 మంది రైతుల నుంచి 24 లక్షల 41 వేల క్వింటాళ్లకు పైగా సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రూ. 122 కోట్ల 5 లక్షలు బోనస్ అందించామని కలెక్టర్ పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతగూడ గ్రామానికి చెందిన పూదరి నగేష్ (40) శనివారం రాత్రి ద్విచక్ర వాహనం పైనుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పూదరి నగేష్ చింతగూడెం నుంచి జన్నారం వైపు వస్తుండగా వాహనం అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
ADB: నార్నూర్ మండలంలోని మాన్కపూర్ గ్రామానికి చెందిన మహత్మే చంద్రకాంత్ ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి బానోత్ గజానంద్ నాయక్ వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మనోధైర్యంతో ఉండాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు లివురావు, బ్రీజ్ లాల్, దాలిఅలీ తదితరులు పాల్గొన్నారు.
BDK: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ ద్వారా ఉత్తమ తహసీల్దార్‌గా కోట రవి కుమార్ ఆదివారం అవార్డు అందుకున్నారు. ఇల్లందు మండలంలో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నందు ఈ అవార్డు లభించింది. పలువురు మండల అధికారులు, ఉద్యోగులు రవి కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
KMM: మధిర సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మధు జిల్లాలో ఉత్తమ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా కలెక్టర్ ముజమ్ముల్ ఖాన్, జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతులు మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మధిర పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
BDK: కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి ఆదివారం జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రశంసా పత్రం అందుకున్న కమిషనర్‌ను మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.
NRML: ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ రాజురా సత్యంను నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ షర్మిల జానకి, జిల్లా ఉన్నతాధికారులు సన్మానించారు. రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ ఛైర్మన్ సత్యంను శాలువా కప్పి సన్మానించారు.
NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీవో తదితర ప్రభుత్వ కార్యాలయాలలో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. సందర్భంగా అధికారులు మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
HYD: బ్లూ క్రాస్ ఆఫ్ HYD- మార్స్ పెట్వేర్ సంయుక్తంగా నిర్వహించిన ‘లవ్ మై ఇండీ డాగో మూడో ఎడిషన్’ వైభవంగా జరిగింది. దోమల్ గూడలోని చైతన్య విద్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది వీధి కుక్కల ప్రేమికులు తమ పెంపుడు కుక్కలతో పాల్గొన్నారు. ఈ షోలోయంగ్ /వైట్ ఇండీ, గ్రేట్ ఇండీ వంటి విభాగాలలో పోటీలు జరిగాయి.
SRCL: జిల్లా వ్యాప్తంగా మండలాలలో పథకాల అమలుకు ఎంపిక చేసిన గ్రామాలను కలెక్టర్ సందీప్ కుమార్ జా ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. . దరఖాస్తులను కంప్యూటర్లలో ఎంట్రీ చేసి అర్హులను గుర్తిస్తామని, మార్చి మాసం వరకు కొనసాగుతుందన్నారు.