WNP: శ్రీరంగాపురం మండలానికి చెందిన 1983-84 బ్యాచ్‌కి చెందిన పూర్వ విద్యార్థులు, గురువుల ఆత్మీయ సమ్మేళనం పెబ్బేరు పట్టణ కేంద్రంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మిత్రులందరు ఒకే చోట వేదికను ఏర్పాటు చేసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 40 ఏళ్ల తర్వాత ఈ అపూర్వ కలయికతో కొందరు విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు.
WNP: అమరచింత పట్టణంలో ఈ నెల 31 మంగళవారం మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఉంటుందని నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ప్రణయ్ కార్డియాక్ కేర్ సెంటర్ వారు ఉ.9 గంటల నుంచి మ.2 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలు ప్రజలు వినియోగించుకోవాలని ప్రకాష్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు.
SRD: అంబేద్కర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి కేవల్ కిషన్ భవన్ నుంచి కలెక్టర్ కార్యాలయం ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడివయ్య మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
JGL: నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ఆదివారం తెలిపారు. డిసెంబర్ 31న ప్రధాన రహదారుల్లో యువకులు మద్యం తాగి వాహనాలు నడపటం, మైనర్లు వాహనాల నడపటం, ట్రిపుల్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటివి చేస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.
SRCL: ప్రభుత్వ ఉన్నత పాఠశాలను అభివృద్ధి పరచాలని ఈ పాఠశాల రిటైర్డ్ హిందీ టీచర్ వాసాలమర్రి విట్టల్ సూచించారు. ఆదివారం నాడు వేములవాడ భీమేశ్వర వీధిలోని బాలాంబిక సాధనములో జరిగిన 1974 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
WGL: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను అత్యంత పారదర్శకంగా నిర్వహించి నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజినీర్ చాణక్య అన్నారు. ఆదివారంGWMC పరిధిలోని కాశిబుగ్గ, తదితర ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఆన్లైన్లో నమోదు తీరును ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్ధ నిర్వహణకు పలు సూచనలు చేశారు.
MNCL: శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు అందరూ సహకరించి అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జన్నారం మండల ఎస్సై రాజ వర్ధన్ కోరారు. ఆదివారం జన్నారం మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో దుకాణదారులకు, ఆటో డ్రైవర్లకు, ప్రజలకు సీసీ కెమెరాల ఉపయోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శాంతి భద్రతల పరిరక్షణ, దొంగతనాల నివారణ సీసీ కెమెరాలతో సాధ్యమన్నారు.
HYD: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు పట్టణ వాసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పండగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సారి మరిన్ని సర్వీసులను పెంచాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాల ప్రయాణికులను సంక్రాంతికి 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
MDK: కొండపాక మండలం జప్తి నాచారం గ్రామానికి చెందిన ముస్త్యాల పరశురాములకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము విజయకుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం కోసం సీఎం రిలీఫ్ చెక్కును అందజేయడం జరిగిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయనతోపాటు పలువురు నాయకులు ఉన్నారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మూడ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న 2013 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ భండారీ కిరణ్ ఆకస్మికంగా మరణించాడు. దీంతో 2012 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు రూ.60 వేల ఆర్థికసాయాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ చేతుల మీదుగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి అందజేశారు.
NRPT: నర్వ మండలంలో మిషన్ భగీరథ నీటి సరఫరాకు 48 గంటలు అంతరాయం ఉంటుందని మిషన్ భగీరథ కార్యనిర్వాహణ అధికారి వెంకటరెడ్డి ఆదివారం తెలిపారు. నారాయణపేట వెళ్లే రహదారిలో పెట్రోల్ బంక్ దగ్గర మిషన్ భగీరథ పైపులైన్ రెండు ప్రదేశాలలో లీకేజీ అవుతున్న కారణంగా నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని తెలిపారు. అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.
KNR: కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడిగా నంది అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ పొన్నం రవిచంద్ర ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఫిలిం సొసైటీ అధ్యక్షుడిగా ఏడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. తన ఎన్నిక పట్ల రవిచంద్ర ఫిలిం సొసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫిలిమ్స్ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
నిజామాబాద్: నవీపేట్ ప్రధాన రైల్వేగేట్ జనవరి 1 వరకు మూసి ఉంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 30వ తేదీన రైల్వే గేటును తెరవాల్సి ఉండగా.. అదనపు పనులు చేపడుతున్నందున మరో రెండు రోజులు పొడిగించినట్లు పేర్కొన్నారు. జనవరి 1న అర్ధరాత్రి రైల్వే గేటు తెరుస్తామని ప్రకటించారు.
HYD: మహిళా సంఘాల సమస్యలను పరిష్కరిస్తామని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ అన్నారు. ఆదివారం ఎంఐఎం కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులను ఆయన కలిశారు. వారి సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ అన్నారు. అలాగే మహిళా సంఘం భవన నిర్మాణ పనులు చేపట్టేలా ప్రభుత్వంతో మాట్లాడి చొరవ చూపుతామన్నారు.
KMR: కస్తూర్బా పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్ల నియామకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సమగ్ర శిక్షా ఉద్యోగులు పేర్కొన్నారు. ఈమేరకు నిజాంసాగర్ లోని కేజీబీవీలో నేడు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా SSA ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ.. సమగ్ర శిక్షా ఉద్యోగులందరూ 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు.