BDK: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం జిల్లా సమీకృత కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు స్వచ్ఛందంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని సూచించారు.