NLG: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుని కీలకపాత్రని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం నకిరేకల్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు బాణాల రాంరెడ్డి పదవి విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.. విద్యా బోధన చేస్తూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులని, పాఠశాల,విద్యార్థుల అభివృద్ధికి వారి సేవలు అభినందనీయమన్నారు.
NZB: ఇందూరు సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. నగరంలో కొనసాగుతున్న ఉద్యోగుల సమ్మెకు ఆదివారం మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు.
KMM: గ్రానైట్ పరిశ్రమకు ఖమ్మం జిల్లా పెట్టింది పేరని, దీని అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ జిల్లా నుంచే ఢిల్లీలో ఉన్న పోలీస్ జాతీయ స్మారక మ్యూజియానికి, ఇండియా గేట్ వద్ద నెలకొల్పిన సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి గ్రానైట్‌ను అందజేయడం జరిగిందన్నారు.
NRPT: మాగనూరు మండలం నేరడగం గ్రామంలో 2025 మార్చి 16, 17,18 తేదీలలో జరిగే సిద్ధి లింగేశ్వర జాతర పోస్టర్‌ను మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆదివారం విడుదల చేశారు. ఈ జాతర సందర్భంగా ఉచిత రక్తదాన శిబిరం, సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
SRCL: మాస శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో ఆదివారం అర్చకులు ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పరివార దేవత అభిషేక పూజ కార్యక్రమాలు అర్చనలు నిర్వహించినట్లు చెప్పారు. సాయంత్రం మహాలింగార్చన పూజ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ప్రతి మాస శివరాత్రి నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
SRD: అమీన్ పూర్ మండలం బీరంగూడ భ్రమరాంబిక నగర్ కాలనీలో ఇంటింటికి సీపీఎం నినాదంతో ప్రజల నుంచి విరాళాల ఆదివారం సేకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆహ్వాన సంఘం ఛైర్మన్ కామ్రేడ్ చుక్కా రాములు హాజరయ్యారు. సంగారెడ్డి పట్టణంలో జనవరి 25 నుంచి 28 వరకు నిర్వహించే సీపీఎం రాష్ట్ర 4వ, మహాసభలను విజయవంతం జయప్రదం చేయాలని ఆయన కోరారు.
KMR: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద మూడు రోజులుగా చేస్తున్న ధర్మసమాజ్ నాయకుల దీక్షను నేడు పోలీసులు భగ్నం చేశారు. నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ మండిపడ్డారు.
NLG: మిర్యాలగూడ పట్టణ ప్రజలు నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా ఆనందదాయకంగా తమ ఇండ్లలోనే జరుపుకోవాలని DSP రాజశేఖర్ ఆదివారం తెలిపారు. ఈనెల 31న మిర్యాలగూడ పట్టణంలోని వివిధ జంక్షన్ లలో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తామని, DJ లకు ఎలాంటి అనుమతి లేదని ఆయన అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NZB: ఆర్మూర్‌కు చెందిన ప్రముఖ సామాజిక సేవకులు పట్వారీ తులసి కుమార్‌కు జాతీయ పురస్కారం వరించింది. ఖమ్మంలో ఇటీవల నిర్వహించిన పుడమిరత్న జాతీయ స్థాయి విశిష్ట సేవా పురస్కారాలు -2024లో భాగంగా ఈ మేరకు వారికి అవార్డు ప్రధానం చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న 60 మందిని పురస్కారానికి ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి పట్వారీ తులసి కుమార్ ఎంపికయ్యారు.
BDK: దమ్మపేట మండలం నాచారంలోని హరిజనవాడలో విద్యుత్ బిల్లు చెల్లించలేదన్న కారణంతో అధికారులు ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ తొలగించారని ఆదివాసీ నాయకులు తంబర్ల రవి అన్నారు. ఆదివారం హరిజనవాడను సందర్శించి స్థానికుల సమస్యలను ఆదివాసీ నాయకులు అడిగి తెలుసుకున్నారు.
HYD: నూతన సంవత్సర వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో కాకుండా వెస్టన్ పద్దతిలో జరుగుతున్నాయని, నూతన సంవత్సర వేడుకల పేరుతో యువత డ్రగ్స్, మత్తు పదార్థాలు సేకరించి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు ముషీరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు.
NRML: జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. డిసెంబర్ 31న జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగవద్దని మైనర్లు వాహనాలు నడపవద్దని, గుంపులు గుంపులుగా రోడ్లపై తిరగవద్దని సూచించారు.
KMM: ఈనెల 31న వైరాలో నిర్వహించే అరుణోదయ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు పుల్లయ్య అన్నారు. ఆదివారం సింగరాయపాలెం గ్రామంలో స్వర్ణోత్సవ సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ స్వర్ణోత్సవ సభలో పలు అంశాలపై చర్చించడం జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని మండల ప్రజలు గమనించి సభలో పాల్గొనాలని పేర్కొన్నారు.
NLG: నిడమనూరు ప్రాంత ప్రజలందరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై గోపాలరావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేడుకలకు ముందు సైబర్ నేరగాళ్లు, శుభాకాంక్షలు బహుమతుల కోసం, లింకులను సోషల్ మీడియా ప్లాట్ ఫారంలో సందేశాల ద్వారా పంచుకోవడం ద్వారా సైబర్ మోసాలకు పాల్పడతారని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
NRML: జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా రషీద్ ఆలం, జిల్లా అధ్యక్షులుగా మహమ్మద్ ఉస్మాన్, ఉపాధ్యక్షులుగా శంకర్ భీమేష్, ప్రధాన కార్యదర్శిగా భోజన్న, సంయుక్త కార్యదర్శిగా నర్సయ్య, కోశాధికారిగా మధుకర్, సభ్యులుగా శ్రీనివాస్ తదితరులు ఎన్నికయ్యారు.