• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేడు బర్కత్ పూరాలో విద్యార్థుల ర్యాలీ

HYD: బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11:30 గంటలకు బర్కత్‌పూరా చౌరస్తాలో వందలాది మంది విద్యార్థులతో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే తిరంగా ర్యాలీలో విద్యార్థులు జాతీయ జెండాలను ప్రదర్శించనున్నారు.

January 25, 2025 / 09:48 AM IST

యువకుడి అవయవ దానం

మేడ్చల్: మరణంలోనూ అవయవదానం చేసి ఆ యువకుడు ఆదర్శంగా నిలిచాడు. మల్కాజిగిరికి చెందిన మనోజ్ కుమారుడు వంశీ (24) అమెజాన్‌లో ఉద్యోగి, ఈనెల 23న కొమరవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో గాంధీ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. దుఃఖంలో ఉండి కూడా కుటుంబ సభ్యులు అతని నేత్రాలు, కిడ్నీలు దానం చేశారు.

January 25, 2025 / 08:53 AM IST

రైల్వే అభివృద్ధికి కృషి చేయండి: ఎంపీ

ADB: సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌ను సికింద్రాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులతో పాటు రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రైళ్ల సంఖ్యను పెంచాలని కోరారు.

January 25, 2025 / 08:28 AM IST

HYDలో అర్ధరాత్రి రూల్స్ బ్రేక్!

HYD: నగరంలో మిడ్‌నైట్ పలువురు వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ జంప్ చేస్తున్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, ఐటీ కారిడార్, కూకట్‌పల్లి తదితర ప్రధాన సిగ్నళ్ల వద్ద రాత్రి 11 దాటితే ఓవర్ స్పీడ్‌తో వెళుతున్నారని ఇతర వాహనదారులు వాపోతున్నారు. దీనికి తోడు ఆకతాయిలు చేసే స్టంట్లతో ఇబ్బంది తలెత్తుతోందన్నారు.

January 25, 2025 / 08:19 AM IST

డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

MDK: పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని 23వ వార్డులో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కమిషనర్, మండల నేతలు, తదితరులు పాల్గొన్నారు.

January 25, 2025 / 07:37 AM IST

పట్టణ అభివృద్ధి కోసం కేంద్రమంత్రికి ఎమ్మెల్యే వినతి

JGL: కరీంనగర్ స్మార్ట్ సిటీ, 24గంటల తాగునీటి పథకం ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం మంత్రికి ఆయన వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ బండి సంజయ్‌ను కలిశారు.

January 25, 2025 / 04:11 AM IST

అర్బన్ ఫారెస్ట్ పార్క్ ప్రారంభం

JGL: జగిత్యాల రూరల్ మండలంలోని అంబారీపేట్ గ్రామంలో అర్బన్ పార్క్‌ను మున్సిపల్ ఛైర్ పర్సన్ జ్యోతి, కలెక్టర్ సత్య ప్రసాద్‌లు శుక్రవారం ప్రారంభించారు. అలాగే పార్కులో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్‌ను, క్లాక్ టవర్‌ను సైతం ప్రారంభించారు. అనంతరం పార్కులో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి, ఆర్డిఓ, స్థానిక MLA, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

January 25, 2025 / 04:08 AM IST

‘ఈనెల 27న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి’

KMM: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల సాధనకై రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 27వ తేదీన నిర్వహించబోయే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గుండెపంగు మల్లేష్ పిలుపునిచ్చారు. మండల వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు 27న వంటలు బంద్ చేసి, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

January 24, 2025 / 08:10 PM IST

‘బాలికలు ఉన్నత రంగాల్లో రాణించాలి’

KMM: బాలికలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్లో ‘బేటీ పడావో బేటీ బచావో’ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం బేటీ బచావోకు మద్దతుగా నిర్వహిస్తున్న క్యాంపెయిన్ ఫ్లెక్సీపై కలెక్టర్ సంతకం చేశారు.

January 24, 2025 / 07:33 PM IST

అభయారణ్యంలో అటవీ విద్యార్థుల పర్యటన

MNCL: జన్నారం మండలంలోని ఇందన్ పల్లి అటవీ రేంజ్‌లో ములుగు అటవీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పర్యటించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా శుక్రవారం ఇందన్ పల్లి రేంజ్ పరిధిలోని మైసమ్మకుంట, గనిశెట్టి కుంటలలో పర్యటించి పలు విషయాలు తెలుసుకున్నారు. అటవీ అధికారులు వన్యప్రాణులు, పక్షుల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్, ప్రొ. శాలిని ఉన్నారు.

January 24, 2025 / 07:31 PM IST

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ

HYD: రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన సీఐ లంచం డబ్బులు తీసుకుంటూ హైదరాబాద్‌లోని షాహినాయత్‌గంజ్ సీఐ బాలు చౌహన్ ఏసీబీకి చిక్కాడు. మిస్సింగ్ కేసులో అనుమానితుడిగా ఉన్న ఓ వ్యక్తి పేరును తొలగించేందుకు రూ.1,50,000 లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. డిమాండ్ చేసిన డబ్బులో రూ.50వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

January 24, 2025 / 06:55 PM IST

మైనారిటీలకు కాంగ్రెస్ పెద్దపీట: వీరయ్య

BDK: కొత్తగూడెం పట్టణంలో భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కార్యాలయాన్ని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పొదెం వీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మైనారిటీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ, వారి అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

January 24, 2025 / 06:49 PM IST

కిన్నెరసానిలో జోరుగా అక్రమ ఇసుక రవాణా

BDK: బూర్గంపాడు మండలంలోని కిన్నెరసానివాగులో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి వేళలో అక్రమదారులు ఇసుక దందాకు తెరలేపుతున్నారని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని, సంబంధిత అధికారులు స్పందించి, పర్యవేక్షించాలని కోరుతున్నారు.

January 24, 2025 / 06:46 PM IST

భరోసాకు ఉపాధి హామీ లింకు వద్దు: సీపీఎం

BDK: దమ్మపేటలో సీపీఎం మండల కమిటీ సమావేశం మండల సభ్యులు పిల్లి నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య మాట్లాడారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంతో లింకు పెట్టకుండా భూమిలేని కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ.12 వేల ఇవ్వాలని డిమాండ్ చేశారు.

January 24, 2025 / 06:43 PM IST

‘పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు’

NGKL: బడిఈడు పిల్లలను పనిలో పెట్టుకుంటే యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాలల సంరక్షణ జిల్లా అధికారి రాజకుమార్, ఎస్సై మాణిక్య నాయక్‌లు హెచ్చరించారు. పెద్దకొత్తపల్లిలో బట్టలషాపు, కిరాణా షాప్‌లలో పిల్లలను పనిలో పెట్టుకున్న ఇద్దరు యజమానులపై కేసునమోదు చేశారు. వారు మాట్లాడుతూ..18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోరాదని సూచించారు.

January 24, 2025 / 06:42 PM IST