NRML: సోన్ మండలం కడ్తాల్ గ్రామానికి సర్వీస్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారం 20వ రోజుకు చేరింది. గ్రామస్తులు మాట్లాడుతూ నిర్మల్, హైదరాబాద్ నుండి వచ్చే భారీ వాహనాలు సర్వీస్ రోడ్డు నుంచి రావడంతో గ్రామంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, గ్రామానికి సంబంధించిన సర్వీస్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.
KNR: కరీంనగర్ నగరంలోని 20వ డివిజన్ ఆరెపల్లి ఆర్టీసీ కాలనీ ప్రాంతాలలో ఆదివారం సుమారు 63 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణానికి స్థానిక డివిజన్ కార్పొరేటర్ తుల రాజేశ్వరి-బాలయ్యతో కలసి నగర మేయర్ సునీల్ రావు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సమగ్ర శిక్షా ఉద్యోగాలు చేపట్టిన సమ్మె నేటితో 20వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె విరమించేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
BDK: వందేళ్ళ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి ఒక్కరికి దిక్సూచి అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పుట్టగొడుగులా పుట్టుకొచ్చే పార్టీలు ఎన్నో వస్తున్నాయని, అవి అధికారం లేకుంటే కనుమరుగవుతున్నాయని చెప్పారు.
BDK: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఏరియా జనరల్ మేనేజర్ కృష్ణయ్యకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. పర్మినెంట్ కార్మికులకు ఇచ్చే సౌకర్యాలను సైతం కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని సీఐటీయూ నాయకులు అబ్దుల్ నబీ తెలిపారు. కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలో జీతాలను చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
HYD: కులుసుంపుర పరిధిలో దారి దోపిడీకి పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణ అనే వ్యక్తి పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న వేళ కులుసుంపుర పరిధిలో ముగ్గురు వ్యక్తులు అతన్ని చుట్టుముట్టి, అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ మరియు వాహన తాళాలు తీసుకొని పరారయ్యారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన ఆదివారం నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాత సేవ చేశారు. ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని జరిపారు.
GDWL: సీఎంఆర్ఎఫ్‌తో పేదలకు మేలు జరుగుతుందని ఆలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు అన్నారు. ఆదివారం రాజోలి మండలంలోని తుమ్మిళ్ళ గ్రామానికి చెందిన మద్దిలేటికీ రూ.8 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందినవారికీ సీఎంఆర్ఎఫ్ ఒక వరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలిలాల రంగారెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు.
NZB: యోగాలో గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన నిజామాబాద్‌కు చెందిన వసంత లక్ష్మీ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో నిర్వహించిన ఆసనాల కార్యక్రమంలో సమకోణాసనంలో గతంలో 3 గంటల 22 నిమిషాల రికార్డు ఉండగా దాన్ని వసంత లక్ష్మీ అధిగమించి 3 గంటల 48 నిమిషాలు ఆసనం వేసి శనివారం ఆమె గిన్నిస్ ఋక్కులో రికార్డు సాధించారు.
SDPT: అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని వీరరెడ్డిపల్లి గ్రామ శివారులో వెలసిన బండ మల్లన్న స్వామి జాతర పనులను దుబ్బాక MLA కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. సంక్రాంతి రోజున బండ మల్లన్న జాతర అత్యంత వైభవంగా నిర్వహించడం ఇక్కడ సంప్రదాయంగా వస్తుందని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు లేకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు.
MBNR: నందిగామ మండలం చేగూరు గ్రామ సమీపంలోని కన్హ శాంతి వనంలో జరిగే ఓ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పుష్పగుచ్చం అందించి ఆదివారం ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు వివరాలను ఇచ్చేందుకు ప్రజలు అందుబాటులో ఉండాలని ఈవో రాహుల్ కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని అన్ని కాలనీలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగంగా జరుగుతుందన్నారు. కొంతమంది ఇళ్లకు తాళాలు వేసి అందుబాటులో లేరని, దీంతో వారి వివరాలు సేకరించడం కష్టంగా ఉందన్నారు. డిసెంబర్ 31 తుది గడువని తెలిపారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆదివారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్తా ఆశీర్వచనంతో పాటుగా శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదాలు అందజేశారు.
MBNR: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ క్యాంప్ ఆఫీస్‌లో అర్బన్ మండలానికి చెందిన 35 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు పథకాలతో మహిళలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని ఆదివారం పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ జీ.అనుపమ చక్రవర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జస్టిస్ దంపతులకు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణమండపంలో ఆలయ అర్చకులు వేదోక్త మంత్రాలలో ఆశీర్వదించారు.