KMR: మద్నూర్ మార్కెట్లో జొన్నల ధరలు మండుతున్నాయి. క్వింటాకు రూ. 6,000 ధర పలుకుతోందని రైతులు తెలిపారు. ప్రస్తుతం జొన్న పంట కల్లాలు కొనసాగుతున్నాయి. దీంతో కొనుగోలు కోసం జనాలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రైతులు పండించిన పంటను నేరుగా ప్రజలకు విక్రయిస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి ధర పెరిగిందని కొనుగోలు దారులు చెబుతున్నారు.
NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో తోటకూరి ఎల్లయ్య ఇటీవల మృతి చెందాడు. ఆ గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆదివారం రూ. 5,000ల నగదును సహాయంగా అందించారు. ధైర్యం చెప్పి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, మాజీ ఉప సర్పంచ్ ఏర్పుల నరసింహ, వార్డు మెంబర్లు, నాయకులు వారితో ఉన్నారు.
MNCL: బడ్జెట్‌లో అంకెల గారడీతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ జన్నారం మండల అధ్యక్షులు రాజారాం రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ఆదివారంలో మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుని పలువురు దివ్యాంగులు మర్యాదపూర్వకంగా కలిసి తమ చిరకాల వాంఛితాలు, సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను శాసనసభలో గళమెత్తాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పక్షాన దివ్యాంగుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతామని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
JGL: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆదివారం నిర్వహిస్తున్న రైతు మహోత్సవానికి జిల్లా నుంచి 3 బస్సుల్లో రైతులను తరలించినట్లు DAO భాస్కర్ తెలిపారు. ఈ మేరకు మల్లాపూర్ మండలం ముత్యంపేట రైతు వేదిక నుంచి, ధర్మపురి ఏడీఏ కార్యాలయం నుంచి, జగిత్యాల కలెక్టరేట్ నుంచి ఒక్కొక్కటి చొప్పున మూడు బస్సుల్లో రైతులు తరలి వెళ్లారు.
KNR: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైతు మహోత్సవం’లో ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు, బూజునూర్, మాల్యాల క్లస్టర్ రైతులు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో బయలు దేరారు. కొత్త ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సందర్శనతో పాటు, ఆధునిక వ్యవసాయ పద్ధతుల స్టాల్స్‌లో యంత్రాలపై శాస్త్రవేత్తల ద్వారా అవగాహన పెంచుకునేందుకు రైతులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
MDCL: మార్చి 22వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అందిస్తుందని, ఇందులో భాగంగానే ప్రజా పాలనలో రైతు ఉత్సవాలను నేడు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట నర్మెట్టలో ప్రారంభిస్తారని మేడ్చల్ జిల్లా రైతులకు మెసేజెస్ వచ్చినట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో భాగంగానే రైతులకు రైతు భరోసా ప్రారంభిస్తారన్నారు.
JN: వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. వల్మిడిలో పక్కపక్కనే రెండు గుట్టలు ఉంటాయి. ఒకటి మునుల గుట్ట, ఇంకొకటి రాములవారి గుట్ట, గతంలో వల్మిడిని వాల్మీకిపురంగా పిలిచేవారని, రామాయణ మహాకావ్యాన్ని వాల్మీకి వల్మిడిలో రచించారని స్థానికులు చెబుతుంటారు. తెత్రాయుగంలో రాముడు సతీసమేతంగా ఈ ప్రాంతాన్ని సందర్శించారని పురణాలు చెబుతున్నాయి.
PDPL: ధర్మారం మండలం నంది మేడారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) సర్వసభ్య సమావేశం ఈనెల 23న (సోమవారం) ఏర్పాటు చేసినట్లు CEO మల్లేశం తెలిపారు. ఉదయం 9 గంటలకు స్థానిక రైతు వేదికలో సంఘం పర్సన్ ఇంఛార్జ్ శివకుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంఘంలోని సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని సూచించారు.
SDPT: పట్టణంలోని రవి నర్సింగ్ హోమ్‌లో ఓ మహిళ ముగ్గురు మగ శిశువులకు జన్మనిచ్చింది. ఖాదర్పురాకు చెందిన ఖాలిద్ బిన్ సవుద్ దంపతులకు ముగ్గురు పిల్లలు పుట్టారు. శిశువులు వరుసగా 3 కేజీలు, 2.5 కేజీలు, 2 కేజీల బరువుతో జన్మించారని, ప్రస్తుతం తల్లితో పాటు ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ రమాదేవి తెలిపారు.
HYD: ORR(క్యూర్) పరిధిలో 23 ప్రభుత్వ పాఠశాలలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో ఏడేసి చొప్పున పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. RR జిల్లాలో 495 స్థలాలతో కలిపి మొత్తం 509 స్థలాలను గుర్తించారు. రూ.572.55 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం జరగనుంది. వీటితో HYDకు వలస వచ్చిన పిల్లలకు ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్య అందిస్తారు.
RR: నందిగామలోని అప్పారెడ్డిగూడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను సర్పంచ్ మల్లేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.22 లక్షల HMDA నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించామని, గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రభాకర్ పాల్గొన్నారు.
HYD: సైబరాబాద్‌లో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 173 మందిపై కేసులు నమోదయ్యాయి. 138 బైక్స్, 10 ఆటోలు, 22 కార్లు, 3 హెవీ వెహికిల్స్ సీజ్ అయ్యాయి. బ్లడ్ ఆల్కహాల్ స్థాయి 145 మందికి 36-200, 15 మందికి 201-300, 13 మందికి 301-550 mg/100 మాల్ వరకు ఉంది. వీరిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. గత వారం 358 కేసుల్లో ఎక్కువమందికి జరిమానా విధించారు.
MNCL: విప్లవ యువ కిషోరాలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 95వ వర్ధంతి సభలను జిల్లా వ్యాప్తంగా జరపాలని పీడీఎస్‌యూ పట్టణ ప్రధాన కార్యదర్శి కె.కార్తిక్ పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాలలో వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగత్ సింగ్ సాహసం, తెగువ, త్యాగనిరతి, దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.