KMM: నిత్యం వార్తా పత్రికలు చేరవేస్తున్న వ్యక్తి.. గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించడంతో వార్తలో నిలిచిన ఘటన చింతకాని మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన రాజుల అనిల్ అనే వ్యక్తి డైలీ న్యూస్ పేపర్స్‌ను ఆటోలో చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.