పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్ ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదాలు పడింది. అయితే ఇటీవల పవన్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో మేకర్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 12న ఈ మూవీని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈనెల 19న అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. ఈ సినిమాకు క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.