భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ రక్షణ రంగం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రక్షణ రంగంలో రూ.50,000 కోట్ల మేర బడ్జెట్లో అదనపు కేటాయింపులు చేపట్టవచ్చని సమాచారం. ఈ పెంపునకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. కాగా.. ఈ ఏడాది బడ్జెట్లో రక్షణ శాఖకు కేంద్రం రూ.6.81 లక్షల కోట్లు కేటాయించింది.