కృష్ణా: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశానుసారం శుక్రవారం ఆమె కార్యాలయం నుంచి మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను పట్టుకుని అమర జవాన్లకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజలందరికీ గర్వకారణమైన విజయమని అన్నారు. ఈ అఖండ విజయానికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తుందన్నారు.