SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగింది. సంబంధిత సీసీ సంతోష్ రైతుల నుంచి వచ్చిన వరి ధాన్యం బస్తాలను కాంటా పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. గత వారం రోజుల నుండి 34 మంది రైతుల నుండి 5,365 సంచుల వడ్లను కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు తరలించినట్లు చెప్పారు. సిబ్బంది, రైతులు ఉన్నారు.