ASR: రాజవొమ్మంగి మండలంలో మలేరియా, డెంగీ దోమల నివారణకు విస్తృత చర్యలు చేపట్టామని మలేరియా యూనిట్ అధికారి ప్రసాద్ శుక్రవారం తెలిపారు. జడ్డంగి, లాగరాయి, రాజవొమ్మంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 21 గ్రామాల్లో దోమల నివారణ మందు స్ప్రేయింగ్ పూర్తి చేశామన్నారు. నెలాఖరులోగా మిగిలిన గ్రామాల్లో స్ప్రేయింగ్ చేస్తామని తెలిపారు.