HYD: ఇబ్రహీంపట్నంలోని AR మెహిఫిల్ హోటల్లో కస్టమర్‌కు గురువారం బిర్యానీలో బల్లి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్విరాన్మెంటల్, శానిటరీ ఆఫీసర్ ప్రణవ్ రూ.5000 పెనాల్టీ వేసి, హోటల్‌ను క్లోజ్ చేశారు. RR జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా తనిఖీలు చేస్తారని స్పష్టం చేశారు. అధికారుల తీరు పట్ల స్థానికులు ఫైన్ వేస్తే సరిపోదు కఠిన చర్యలు తీసుకోవాలంటూ పేర్కొంటున్నారు.