SRCL: యాసంగి మార్కెటింగ్ సీజన్ 2024-25లో పండిన నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ ఖ్యమ్య నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ తన ఛాంబర్‌లో యాసంగి మార్కెటింగ్ సీజన్ 2024-25 ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
KNR: జమ్మికుంట స్థానిక వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం యార్డుకు రైతులు 73 క్వింటాళ్ల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,170, కనిష్ఠంగా రూ.6,900 పలికింది. గోనె సంచుల్లో 8 క్వింటాలు తీసుకురాగా.. రూ.5,300 నుంచి రూ.6,400 వరకు పలికింది. తాజాగా పత్తి ధర నిన్నటి కంటే ₹20 పెరిగింది. పత్తి కనీస ధరను పెంచాలని రైతులు కోరుతున్నారు.
SRCL: వేములవాడ కోర్టులో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోర్టుకు వచ్చే కక్షి దారుల దాహార్తించడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు.
ADB: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దత్తత తీసుకున్న బుర్కి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించి పరిశీలించారు. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు దుప్పట్లు, విద్యార్థులకు యూనిఫాంలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి ఖుష్బూ గుప్తాతో కలిసి అందజేశారు.
NGKL: పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన ఓ వివాహిత మహిళను ఓ యువకుడు ఫోన్ లో వేధించడంతో ఆ మహిళ ఇవాళ షీ టీం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు నాగర్ కర్నూల్ జిల్లా షీ టీం అధికారిని విజయలక్ష్మి తెలిపారు. వేధింపులకు పాల్పడిన యువకుడిపై చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు.
ADB: బోథ్ మండల కేంద్రములో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైయిన 100 పడక గదుల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మాణాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు అనిల్ జాదవ్ పేర్కొన్నారు.
KNR: జిల్లా చిగురుమామిడి (M) ఇందుర్తికి చెందిన మల్లవ్వ అనే వృద్ధురాలి మృతదేహం తిమ్మాపూర్ ఎల్ఎండీ జలాశయం వద్ద లభించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించగా సమీపంలో ఒక సంచిలో ఇందుర్తి గ్రామంగా గుర్తింపు కార్డు ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRPT: సూర్యాపేట (D) హుజూర్‌నగర్ ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూర్‌నగర్‌కి చెందిన రోజా తన స్నేహితురాలిని ఇంటికి పిలిచింది. ఆపై మద్యం తాగించి మత్తులోకి వెళ్లాక రోజా ప్రియుడు ప్రమోద్ ఆ యువతిపై అత్యాచారం చేయగా ఆమె వీడియో తీసింది. ఆ యువతికి మళ్లీ ఫోన్ చేసి పిలిపించి ఈసారి తన ఫ్రెండ్ హరీశ్ కోరిక తీర్చాలని ప్రమోద్ కోరగా ఆమె నిరాకరించింది.
NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ను భారీగా పెంచింది. గతేడాది బడ్జెట్‌లో 96.07 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం ఈసారి వాటిని 297.95 కోట్లకు పెంచింది. ఆ నిధులతో డ్యామ్ సంబంధిత ప్రధాన పనులు కాలువలు డిస్టబ్యూటరీ పనులను చేపడుతామని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో సాగర్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు.
NLG: నల్గొండ పట్టణంలోని నడ్డివారి గూడెంలో పట్టణ పేదల సంఘం కన్వీనర్ దండంపెల్లి సత్తయ్య గురువారం సంతకాల సేకరణను చేపట్టారు. పట్టణ పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఉపాధి హామీ పథకం వర్తింప చేయాలని కోరుతూ… సీఎంకు పంపించే లేఖ పై పేదలతో ఆయన సంతకాలు చేయించారు. ఈనెల 24న ఆర్డీవో కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పాల్గొనాలని కోరారు.
MDK: పౌర సరఫరాల శాఖ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో సీజ్ చేసిన బియ్యాన్ని వేలం నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారి పేర్కొన్నారు. 6a కేసు కింద సీజ్ చేసి నిల్వ ఉంచిన బియ్యాన్ని ఈనెల 24న ఉదయం 10 గంటలకు వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనేవారు 22 సాయంత్రం 5 గంటల లోపు రూ.2500 డిపాజిట్ చేయాలని సూచించారు.
MDK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లోని అన్ని మండలాల ఎమ్మార్వోలతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆయా మండలాలలోని ఎమ్మార్వో కార్యాలయంలోకి వచ్చే ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని సూచించారు.
KNR: కరీంనగర్ నగరపాలక సంస్థపై కాషాయ జెండా ఎగర వేసేందుకు సిద్ధం కావాలని, ఆ కరీంనగర్ నగరపాలక సంస్థపై కాషాయ జెండా ఎగర వేసేందుకు సిద్ధం కావాలని, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ నగర అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతో జరిగిందని అన్నారు.
BHPL: విద్యార్థులు కృషి, పట్టుదలతో ముందుకు సాగితే మంచి భవిష్యత్తును సాధించగలరని భూపాలపల్లి పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ అన్నారు. గొల్లబుద్దారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన “అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి” ప్రేరణ కరపత్రాన్ని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాజేందర్ పాల్గొన్నారు.
WGL: వేగవంతంగా కమర్షియల్ ట్రేడ్ వసూలు చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే అధికారులను ఆదేశించారు. కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూళ్లపై ప్రజా ఆరోగ్య విభాగ అధికారులు, డిప్యూటీ కమిషనర్‌తో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ తగు సూచనలు చేశారు. సానిటరీ ఇన్స్‌స్పెక్టర్లు, రెవిన్యూ అధికారులు, జవాన్లతో బృందాలను ఏర్పాటు చేసి, సర్కిల్‌కు 7 బృందాలు కేటాయించారు.